»   »  హార్ట్ స్ట్రోక్ తో సీనియర్ నటి మృతి

హార్ట్ స్ట్రోక్ తో సీనియర్ నటి మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: అప్పట్లో ఉపేంద్ర హీరోగా వచ్చిన ఉపేంద్ర చిత్రంలో మారిముత్తు అనే పాత్ర చేసిన నటి గుర్తుందా. ఆమె పేరు సరోజమ్మ... కన్నడంలో పేరున్న నటి. ఆ చిత్రం ద్వారా ప్రముఖ నటిగా పేరొందిన సరోజమ్మ గుండెపోటుతో మృతి చెందారు.

బెంగుళూరులోని కమలానగర్‌లో నివసిస్తున్న ఆమె అస్వస్థతకు గురికాగా ఓ ప్రై వేటు ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే ట్రీట్ మెంట్ ఇస్తున్నా ఫలితం లేక.. సరోజమ్మ మృతి చెందారు.

Kannada actress Sarojamma dies of cardiac arrest

ఉపేంద్ర చిత్రంలో మారిముత్తు పాత్రలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. అలాగే మరో కన్నడ హీరో దర్శన హీరోగా నటించిన 'కిట్టీ' చిత్రంలో విలన్ పాత్రలోనూ పేరొందారు. పలు కన్నడ సినిమాలలో ఆమె నటించారు.

మారిముత్తు సరోజమ్మ మృతి పట్ల శాండల్‌వుడ్‌ తారలు, దర్శక నిర్మాతలు సంతాపం వ్యక్తం చేశారు. కమలానగర్‌లోని ఆమె నివాసం వద్దకు వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను కలిసి ఓదార్చారు.

English summary
Kannada actress Sarojamma dies of cardiac arrest. She resides in Kamalanagar. She is admitted into a private hospital. While undergoing treatment, she breathed her last. She lived in the role of Maarimuttu in the film of Upendra. She played the role of vamp in film ‘Kitti’ in which Darshana was hero. Directors, Producers and actors and actresses condoled her demise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu