»   » 30 సూపర్ హిట్ల దర్శకుడు కానీ వైద్యానికి కూడా డబ్బు లేక, దాతల కోసం ఎదురుచూపు

30 సూపర్ హిట్ల దర్శకుడు కానీ వైద్యానికి కూడా డబ్బు లేక, దాతల కోసం ఎదురుచూపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

30కు పైగా కన్నడ హిట్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఈ రోజు కనీస వైద్య సౌకర్యం కోసం ఎదురు చూస్తూ హాస్పిటల్ లో ఉన్నాడు. 80-90లలో ఎ.టి.రఘు తీసిన సినిమాలలో దాదాపు అన్నీ హిట్ సినిమాలే. కేవలం ఒక్క హీరో తోనే 20 హిట్లు ఇచ్చాడు అంటేనే రఘు సత్తా ఏమిటో తెలుస్తుంది. అయితే ఇప్పుడు పరిస్తితి తారుమారయ్యింది. అన్ని సినిమాలని అందించిన ఆయన ఈయన ఇప్పుడు మాత్రం ఆర్థికంగా సహాయంకోసం ఎదురు చూస్తున్నారు.

వైద్యసాయం కోసం

వైద్యసాయం కోసం

ఎ.టి.రఘు కిడ్నీ ఫెయిల్‌ అయి అనారోగ్యంతో బాధపడుతూ వైద్యసాయం కోసం ఎదురు చూస్తున్నారు. కర్ణాటక లోని కొడుగుకు చెందిన రఘు చిన్నప్పటి నుంచి సినిమారంగంపై ఉన్న ఆసక్తితో బెంగళూరులోనే గడిపారు. సినిమా తీయటమే జీవితంగా బతికారు. ఒకటీ రెండు కాదు 30 సూపర్ హిట్లు ఇచ్చాడు.

సూపర్‌డూపర్‌ చిత్రాలు

సూపర్‌డూపర్‌ చిత్రాలు

ఆయన దర్శకత్వంలోని సూపర్‌డూపర్‌ చిత్రాలు న్యాయనీతిధర్మ, ధర్మయుద్ద, అవళె నెరళు, గూండాగురు, కాడిన్ రాజ, మిడద హృదయగళు, కెంపుసూర్య, అజయ్‌విజయ్‌, మైసూరు జాణ, పుట్టహెండ్తీ, సూ ర్యోదయ, జైలర్‌ జగన్నాథ్‌, మండ్యదగండు, బేటి గార, అగ్నిసాక్షి వంటి 30కుపైగా చిత్రాలకు రఘు దర్శకత్వం వహించారు.

కన్నడ రెబల్‌స్టార్‌

కన్నడ రెబల్‌స్టార్‌

కన్నడ రెబల్‌స్టార్‌ అయిన అంబరీష్‌తోనే ఏకంగా 20చిత్రాలు నిర్మించిన రికార్డు కూడా రఘుకే చెల్లుతుంది. ఈ అంబరీష్ ఎవరొ కాదు తెలుగులో ఒకప్పటి హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తార సుమలత భర్త. కన్నడ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఈ నటుడు రఘు తీసిన సినిమాల వల్లే అంతటి పాపులారిటీ తెచ్చుకున్నారనటం లో సందేహమే లేదు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌

1994లో మేరీ అదాలత్‌ అనే హిందీ సినిమాలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించారు. దాదాపు 30 ఏళ్ళ పాటు సీనీరంగంలో ప్రముఖుడిగా కొనసాగిన ఎటీ రఘు ఇటీవల కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్షలు జరిపిన వైద్యులు కిడ్నీ ఫెయిల్‌ అయిందని తేల్చారు.

ఆర్థిక స్థోమత లేక

ఆర్థిక స్థోమత లేక

కనీసం వైద్యం జరిపించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక దాతల కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా రంగానికి చెందిన వారే కాకుండా ఎవరైనా సా యం చేస్తే మరిన్ని రోజుల పాటు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు డాక్టర్లు. అన్ని సినిమాలతో ఎందరికో నట జీవితాన్నిచ్చిన ఆయన ఇప్పుడు తన జీవితాన్ని నిలబెట్టే మనుషుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు

ఆర్థిక సాయం చేయదలచినవారు

ఆర్థిక సాయం చేయదలచినవారు

ఆయనకి అవసరమైన వైద్య సౌకర్యాలనిమిత్తం ఆర్థిక సాయం చేయదలచినవారు కొటక్‌ మహేంద్రబ్యాంక్‌ అకౌంట్‌ నంబరు 144010031268 ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ KKBK0008272 మడికెరె శాఖ కు జమచేయాలని కోరుకుంటున్నారు. ఆయనకు సహాయం అంది మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు

English summary
Popular director AT Raghu has suffered kidney failure and is undergoing dialysis regularly. Both his kidneys have failed and unless he gets organ donation he cannot fully recover
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu