»   » కన్నడ నాట మళ్ళీ వివాదం: "సే నో టు బాహుబలి" అంటూ దర్శకుల యుద్దం.....

కన్నడ నాట మళ్ళీ వివాదం: "సే నో టు బాహుబలి" అంటూ దర్శకుల యుద్దం.....

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ 'బాహుబలి-2' విడుదలై అన్ని చోట్ల కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.బాహుబలి ఐదేళ్ళ కాలం, వేల మంది శ్రమ తెలుగు సినిమాలో మరచిపోలేని చరిత్రను క్రియేట్‌ చేశాయి.తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయిలో ప్రపంచ సినిమా అయ్యింది .

600 కోట్లకు పైగా కలెక్షన్స్‌

600 కోట్లకు పైగా కలెక్షన్స్‌

విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించారు. బాహుబలి ది బిగినింగ్‌ సినిమా 2015లో విడుదలై 600 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి తెలియజేసింది. పార్ట్‌ 1 కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించడంతో బాహుబలి 2 ఎలా ఉంటుందోనని ఆసక్తి మరింత పెరిగింది.


రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి

రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి

అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న ఈ రెండేళ్లు అందరిలో క్యూరియాసిటినీ మరింత పెంచింది.ఇన్ని అంచనాలతో వచ్చిన బాహుబలి అన్ని భాషలలోనూ తన దండయాత్ర మొదలు పెట్టాడు... టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇల్ల ఒక్కొక్క ఇండస్ట్రీలో రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి....


బాహుబలి ని చూడకండి అంటూ

బాహుబలి ని చూడకండి అంటూ

భారతీయ సినిమా చరిత్రలో గత ఐదేళ్ల కాలంలో బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమా గురించి జరిగిన చర్చ మరే చిత్రంపైనా జరుగలేదు. తెలుగు సినిమాగా ప్రారంభమై అంచెలంచెలుగా అంచనాలను పెంచుతూ భారతీయ సినిమాగా మారింది. విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమాని చూడాల్సిందే అంటూ జనాలు పరుగులు తీస్తూంటే కన్నడ పరిశ్రమ లోని దర్శకులు మాత్రం బాహుబలి ని చూడకండి అంటూ పిలుపునిస్తున్నారు.


 కన్నడ సినిమాలకు గట్టి దెబ్బే

కన్నడ సినిమాలకు గట్టి దెబ్బే

కన్నడ పరిశ్రమకు చెందిన దర్శకులు బాహుబలి చూడొద్దంటూ పిలుపునిస్తుండటం విశేషం. ఇంతకీ ఇది సత్యరాజ్ కావేరీ వ్యాఖ్యల కారణం గానో, లేదంటే మరే మనొభావాల ఇష్యూనో కాదు. ‘బాహుబలి: ది కంక్లూజన్' వల్ల కన్నడ సినిమాలకు గట్టి దెబ్బే తగిలింది.


సే నో టు బాహుబలి

సే నో టు బాహుబలి

ఇప్పటికే థియేటర్లలో ఉన్న సినిమాలన్నీ వాషౌట్ అయిపోయాయి. కొత్తగా ఇప్పుడిప్పుడే సినిమాలుు రిలీజ్ చేసుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు.. సినీ ప్రముఖులు.. ‘సే నో టు బాహుబలి' అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేయడం విశేషం.


 బాహుబలి లాంటి సినిమాలు వచ్చినపుడు

బాహుబలి లాంటి సినిమాలు వచ్చినపుడు

అసలే కాస్త లోబడ్జెట్ సినిమాలు వచ్చే శాడల్ వుడ్ లో బాహుబలి లాంటి సినిమాలు వచ్చినపుడు కన్నడ సినిమాలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని.. కన్నడ సినిమాల్ని తీసేసి థియేటర్లన్నింటినీ ఇలాంటి భారీ సినిమాలతో నింపేస్తున్నారని.. ముఖ్యంగా తెలుగు సినిమాల వల్ల తమ ఇండస్ట్రీ చాలా నష్టపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సత్యరాజ్ సారీ చెప్పడంతో

సత్యరాజ్ సారీ చెప్పడంతో

బాహుబలి-2 విడుదలకు ముందు కూడా కర్ణాటకలో పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఐతే సత్యరాజ్ కన్నడిగులకు సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగి సినిమా యధావిధిగా రిలీజైంది. అంతా హమ్మయ్యా అనుకున్నారు. కర్ణాటకలో బాహుబలి క్రేజ్, వసూళ్ళు కూడా బాగానే ఉన్నాయి.
కట్టప్ప వివాదం కూడా

కట్టప్ప వివాదం కూడా

కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఇంకో కోణం నుంచి వివాదం మొదలయ్యింది. ఇంతకీ ఇదివరకటి "కట్టప్ప వివాదం కూడా" నిజంగా కావేరీ వ్యాఖ్యల వల్లనేనా.. లేదంటే ఇలాంటి భయాలతోనే సినిమాని అడ్డుకుందాం అని చూసారా...!!?? అన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ కి చెందిన జనాలు. ఎందుకంటే మొదటినుంచీ ఒకే ఒక సంఘం హడావుడే తప్ప జనాల్లో బాహుబలి పట్ల పెద్ద వ్యతిరేకత ఏమీ కనిపించలేదు.English summary
A new controversy started about Bahubali 2 in Sandal wood, Kannada Directors says don't watch Bahubali and encourage Kannada movies
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu