»   » మహేష్‌ బాబు దర్శకత్వంలో 'రెడీఫర్‌ ఢీ'

మహేష్‌ బాబు దర్శకత్వంలో 'రెడీఫర్‌ ఢీ'

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడ హీరో దర్శన్‌ కన్నడంలో నటించిన 'అభయ్‌' చిత్రన్ని నితిన్‌ ప్రొడక్షన్‌ సంస్థ తెలుగులో 'రెడీఫర్‌ ఢీ' పేరుతో అనువదిస్తోంది. 'రెడీఫర్‌ ఢీ' చిత్రానికి మహేష్‌ బాబు దర్శకుడు. 2006లో మిస్‌ ఇండియాగా ఎంపికైన ఆర్తి ఠాగూర్‌ ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. తెలుగు రచయిత జనార్థన మహర్షి ఈ చిత్రానికి రచన చేశారు. బెంగుళూరులో స్థిరపడిన తెలుగు నిర్మాత బి.జి.బాపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన ఇంతకుముందు కన్నడంలోనే 'మిస్టర్‌ బకరా, ఊడుగాయి' పేరుతో చిత్రాలు నిర్మించారు.

కథ ప్రకారం ఛార్టెడ్ ఎకౌంటెంట్ అభయ్(దర్శన్) స్విజ్జర్ లాండ్ వెళుతూ ప్లైట్ లో ఆర్తి (ఆర్తి ఠాకూర్) ని కలుస్తాడు. ఆమె ఎమ్మల్యే సోదరుడు పండుతో ఎంగేజ్ మెంట్ అవబోతూంటే వారి నుంచి తప్పించుకుని పారిపోయి వస్తూంటుంది. అక్కడే పరిచయం ప్రణయంగా మారుతుంది. దాంతో అభయ్ ఓ ప్లాన్ చేసి ఆర్తిని తీసుకెళ్ళి పండుకి అప్పచెప్తాడు. ఆ తర్వాత తనదైన ఓ స్టోరి చెప్పి ఆ ఇంట్లోకే ప్రవేశించి గేమ్ ఆడి ఆమెను తనతో తీసుకెళ్ళతాడు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని వాటిని ఎలా అనుకూలంగా మార్చుకున్నారనేది ఇందులో ప్రధానాంశమని నిర్మాత బాపురెడ్డి తెలిపారు. షూటింగ్‌ అరవైశాతం బ్యాంకాక్‌, పటాయ్‌, ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆరు పాటలున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu