twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోని చంపి నిర్మాత పరార్

    By Staff
    |

    Kannada Producer
    రీల్ లైఫ్ రియల్ లైఫ్ గా మారిన సంఘటన నిన్న తెల్లవారుఝామున(మంగళవారం) బెంగుళూరు అవుట్ స్కర్ట్స్ లోని ఫార్మ్ హౌస్ లో చోటు చేసుకుంది. కన్నడంలో భారీ చిత్రాలు నిర్మించే గోవర్ధన్ మూర్తి తన రివాల్వర్ తో అప్ కమింగ్ హీరో వినోద్ కుమార్ (32) ని చంపి పరారయ్యారు. శరీరంలోకి రెండు బుల్లెట్లు దిగి రక్త స్రావం ఎక్కువ అవటంతో హాస్పటిల్ కి వెంటనే వెళ్ళినా మరణించటం జరిగింది. ఆ సంఘటనా వివరాలు ..

    వినోద్ కుమార్ ..ఇప్పుడిప్పుడే కన్నడ పరిశ్రమలో హీరోగా ఎదుగుతున్న ఛోట్ నటుడు. అలాగే గోవర్ధన్ రెడ్డి ఈ మద్యనే మాదేష అనే చిత్రాన్ని శివరాజకుమార్ హీరోగా నిర్మించి మంచి విజయం సాధించారు. వీరి ఉమ్మడి మిత్రుడు శంకర్ రెడ్డి అనే రియల్టర్. వీరు ముగ్గురు కలిసి గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్,సినిమా పరిశ్రమలలో పెట్టు బడులు పెడుతూ వ్యాపారం చేసేవారు.

    ఇక నిన్న ఉదయం తొమ్మిది గంటలకు వినోద్ కుమార్ Kammanahalli ప్రాంతంలో ఉన్న తన ఇంటినుండి శంకర్ రెడ్డితో కలసి సబ్ రిజస్ట్రార్ ఆఫీస్ కి ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్ కి వెళ్ళారు. తర్వాత సాయింత్రం వినోద్ సెల్ కి Hosur Bande వద్ద నున్న ఫార్మ్ హౌస్ కి రమ్మని గోవర్ధన్ నుండి కాల్ వచ్చింది. ఫార్మ్ హౌస్ వద్ద గోవర్ధన్ అప్పటికే గన్ మెన్స్ తిరుపతి,గణపతి,వర్కర్స్ రమేష్,దినేష్, ప్రెండ్ బాబు లతో ఉన్నాడు. వారంతా రాత్రంతా తాగారు. ఇంతలో 12.15 నిముషాలకి గోవర్ధన్,రెడ్డి,కుమార్ ఓ రివాల్వర్ పేలిన శబ్దం విన్నారు. చూసి వచ్చిన రెడ్డి రమేష్,దినేష్ గొడవపడుతుంటే గన్ మెన్ తిరుపతి దాన్ని ఆపటానికి గాలిలోకి తుపాకి పేల్చాడని చెప్పుకొచ్చాడు. దాంతో వారంతా బయిటకు వచ్చారు.

    అప్పుడు గోవర్దన్ గన్ మెన్ నుండి ఆ రివాల్వర్ తన చేతులోకి తీసుకున్నాడు. తర్వాత వినోద్ కుమార్ పొట్టకి గురిపెట్టి కాల్చటమంటే ఇదిరా అని అంటూ హఠాత్తుగా పేల్చేసాడు. అంతే రెండు బుల్లెట్స్ నేరుగా దిగటంతో వినోద్ కుప్పకూలిపోతూ..నేను ఏ తప్పూ చేయలేదు పార్టనర్ అన్నాడు. అప్పుడు విచిత్రంగా గోవర్దన్ అతని కాళ్ళ దగ్గర కూర్చుని అపాలజీ చెప్పసాగాడు. అంతా ఈ హఠాత్ సంఘటనకు షాకయి పోయారు. ముందుగా తేరుకున్న బాబు మరియు శంకర్ రెడ్డి ఇద్దరూ కుమార్ ని తీసుకుని Kammanahalli లోని సత్యసాయి ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అయితే వారు ట్రీట్ మెంట్ ఆ స్ధితిలో చేయటానికి ఒప్పుకోలేదు. అప్పుడు మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. వారు బుల్లెట్స్ తొలిగించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.అప్పటికే ప్రాణం పోయింది.

    ఇక గోవర్ధన్ వైల్డ్ గా బిహేవ్ చేయటం ఇదే మొదటిసారి కాదు. మాదేష్ సినిమా సెన్సార్ సమయంలో ఆ సెన్సార్ మెంబర్స్ ని బెదరించటం జరిగిందని గోవర్ధన్ మార్తిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈ మధ్యనే అతని ఇంటిపై ఇనకంటాక్స్ దాడి జరిగితే ఆ ఆఫీసర్స్ ని బెదిరించినట్లు కంప్లైంట్ నమోదు అయింది.

    అలాగే వినోద్ కుమార్ హీరోగా చేసిన తొలి చిత్రం Gulaama విడుదల కావల్సి ఉంది. ఇక ఈ కేసు నిమిత్తం వారి పార్టనర్ ,ఫ్రెండ్ శంకర్ రెడ్డి ని పోలీసులు కలిస్తే..ఈ హత్యం వెనక ఏ ఉద్దేశం ఉందో అర్ధం కావటం లేదు. అయితే వినోద్ కుమార్, గోవర్ధన్ రెడ్డి ఎంత మంచి మిత్రులో అంతకు మించి శత్రువులు అన్నాడు.

    పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ గోవర్ధన్ మరియు వినోద్ లకి గతకొంతకాలంగా శతృత్వం కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ లో వచ్చిన సమస్యలే వినోద్ ప్రాణాల్ని తీసేలా ఉసిగొల్పాయి. గోవర్దన్ కోసం సెర్చింగ్ జరుగుతోంది.

    ఆంధ్రా క్యాబినేట్ మినిస్టర్ ని కూడా చీట్ చేసాడు పరార్ లో ఉన్న గోవర్ధన్ మూర్తి గురించి ఆంద్రా పోలీసులు కూడా గత కొద్ది రోజులుగా వెతుకుతున్నారు. గోవర్ధన్ ఇక్కడ ఉండే ఈ క్యాబినెట్ మినిస్టర్ చేత దాదాపు నలభై కోట్ల రూపాయలు బెంగుళూరు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టించాడు. మూడు నెలల్లోనే రెట్టింపు ఆదాయం వస్తుందని చెప్పి డబ్బుని నొక్కేసాడు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేయటం జరిగింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X