»   »  రిలీజ్ ఆపాలంటూ హై కోర్ట్ కు

రిలీజ్ ఆపాలంటూ హై కోర్ట్ కు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : వివిధ కారణాలతో కోర్టుకు వెళ్లి విడుదలకాబోయే చిత్రాలను ఆపుచేయించటం ఈ మధ్యకాలంలో బాగా జరుగుతున్నాయి. తాజాగా అవధూత్‌ కదమ్‌ దర్శకత్వం వహించిన మరాఠి చిత్రం ‘మరాఠ టైగర్స్‌' చిత్రాన్ని సైతం ఆపాలంటూ వివాదాలు మొదలయ్యాయి. ఈ చిత్రం విడుదలను అడ్డుకోవాలంటూ వచ్చిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

Kannada groups oppose release of Marathi film “Marathi Tigers”.

బెళగావి వద్ద సరిహద్దు వివాదాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం విడుదలను అడ్డుకోవాలంటూ అర్జీదారుడు భీమాశంకర్‌ పాటిల్‌ ఉన్నత న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నారు. చిత్రం విడుదలతో బెళగావి, మహరాష్ట్ర సరిహద్దుల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని అర్జీదారుడు పేర్కొన్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 5వ తేదీన విడుదల కానుంది. అర్జీ విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

Kannada groups oppose release of Marathi film “Marathi Tigers”.
English summary
Marathi Tigers”, a Marathi feature film allegedly depicting the protracted boundary dispute between Karnataka and Maharashtra, has sparked off peaceful protests among Kannada organisations
Please Wait while comments are loading...