చంపేస్తామంటూ హీరో కి బెదిరింపు కాల్స్
బెంగళూరు : ‘జాత్రె' సినీ హీరో చేతన్ చంద్రకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి హత్య చేస్తామని రాత్రి బెదిరించారు. ఈ విషయంపై ఆయన వెంటనే రాజరాజేశ్వరినగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘మాస్టర్ పీస్' సినిమా గురువారం విడుదలవుతున్న నేపథ్యంలో కొందరు ‘జాత్రె' సినీ పోస్టర్లను తొలిగించి కొత్తగా విడుదలవుతున్న సినీ పోస్టర్లను అంటించారు. పోస్టర్లు అంటించిన వ్యక్తులు చేతన్ చంద్రకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. కేసుదర్యాప్తులో ఉంది.



Click it and Unblock the Notifications











