»   » ఆస్కార్‌.. రేసులో రెండు కన్నడ సినిమాలు

ఆస్కార్‌.. రేసులో రెండు కన్నడ సినిమాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : కన్నడ సినీ పరిశ్రమకు అదృష్టం కలిసొచ్చింది. ఏకంగా రెండు సినిమాలు ఆస్కార్‌ రేస్‌లో చోటు సాధించాయి. కిషన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కేరాఫ్‌ ఫుట్‌పాత్‌2' సినిమాకు నేరుగా ఎంట్రీ లభించగా ‘రంగితరంగ' సినిమాకు రెండో విడతలో.. తాజాగా స్థానం లభించింది.

ఆస్కార్‌ కమిటి సిద్ధం చేసిన 305 సినిమాల జాబితాలో ఈ రెండు సినిమాలున్నాయి. పూర్తిగా కొత్తవారితో రూపొందినప్పటికీ ‘రంగితరంగ' సినిమా అనేక భారీ బడ్జెట్‌ సినిమాల్ని సైతం తట్టుకుని 25 వారాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న విషయం తెలిసిందే. విదేశాల్లో సైతం ఈ సినిమా అర్ధ శతదినోత్సవం పూర్తిచేసుకోవడం గమనార్హం.

 Kannada movie Rangitaranga, ‘Care Of Footpath 2’ is nominated for oscar

వచ్చే సంవత్సరం లాస్‌ ఏంజిల్స్‌లో జరగనున్న 88వ అకాడమీ అవార్డ్స్‌'ఆస్కార్‌ నామినేషన్ల కోసం దాదాపు 305 చిత్రాలను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. మన దేశం తరపున మరాఠీ చిత్రం 'కోర్ట్‌' ఎంపికైన విషయం తెలిసిందే

ఈ విషయాన్ని దర్శకుడు అనూప్‌ భండారీ తన అధికారిక సోషల్ నెట్ వర్కింగ్ ఖాతా ద్వారా తెలియ జేశారు. అందులో మా చిత్రం ఉండటం చాలా ఆనందంగా ఉంది. మా చిత్రం ఈ స్థాయికి వెళ్ళడానికి కారణమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు' అని దర్శకుడు అనూప్‌ పేర్కొన్నారు. దీనికి సంబందించిన ట్వీట్ ని సినిమా యునిట్ రంగి తరంగ అధికారిక ట్విట్టర్ ల్లో పెట్టారు ఇక్కడ చూడండి..

English summary
RangiTaranga is one of the 305 films shortlisted for OSCAR nominations.Esha Deol’s Kannada film ‘Care Of Footpath 2’ also joins Oscar 2016 race .
Please Wait while comments are loading...