»   »  హీరోయిన్ సంజనాపై నిర్మాతల ఫిర్యాదు, క్షమించమంటూ సంజన

హీరోయిన్ సంజనాపై నిర్మాతల ఫిర్యాదు, క్షమించమంటూ సంజన

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: 'బుజ్జిగాడు' చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో తెలుగు తెరకు పరిచయమైన సంజన ఆ తర్వాత తెలుగులో అడపా దడపా చిత్రాల్లో నటించినా పెద్దగా స్టార్ స్టేటస్ తెచ్చుకోలేక పోయింది. అయితే సినిమా ఫంక్షన్లు, ఫోటో షూట్లు, వివాదాలతో మాత్రం గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె తన సినిమాల కన్నా వివాదాలతో ఎక్కువగా మీడియాలో వార్తలకు ఎక్కుతోంది. తాజాగా మరోసారి ఓ వివాదంలో ఇరుక్కుని మీడియాకు ఎక్కింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కన్నడ చిత్రాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ ప్రముఖ కన్నడ నటి సంజనాపై కన్నడ చిత్ర నిర్మాతలకు కొందరు కర్ణాటక చిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు చేశారు. టీవీషోలలో సినీ రంగ ప్రముఖులు పాల్గొంటున్న విషయంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నటి సంజనా... దర్శకనిర్మాతలు డబ్బా సినిమాలను తీసి వాటిని ప్రజలపై రుద్దుతుండడం వల్లే టీవీల్లో ప్రసారమయ్యే రియాలిటీషోలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని వ్యాఖ్యానించడం సరికాదంటూ ఫిర్యాదు చేశారు.

 sanjjanaa

ఈ వివాదంపై స్పందించిన నటి సంజనా ..టీశీ వెంకటేశ్ తనను ఏకవచనంతో సంభోధిస్తూ తనపై చేసిన వ్యాఖ్యల దృష్ట్యా అలా మాట్లాడానన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరుతూ తన ఫేస్‌బుక్‌లో వీడియో విడుదల చేసారు.


సంజనకు ఆ మధ్యన సినిమా నిర్మాతల నుండి కూడా లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. తన కోరిక తీర్చమంటూ వేధించిన ఓ నిర్మాత బండారం సంజన బయట పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె 'సరదా' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు వన్స్ ఎపానె టైం అనే మరో తెలుగు సినిమాకు కూడా ఆమె కమిటైంది.

బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రంలో తన క్యూట్ పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత సత్యమేవ జయతే, సమర్థుడు, పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, యమహోయమ, జగన్ చిత్రాల్లో నటించిన సంజనకు ఒక్క హిట్టూ దక్కక పోవడంతో ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి.

అయితే కన్నడ సినిమాల్లో అమ్మడు ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంది. అక్కడ కూడా కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతుండటంతో అవకాశాలు అడపాదడపాగానే రావడం మొదలపెట్టాయి. ప్రస్తుతం సినిమాలు ఏమీ లేక పోవడంతో కన్నడలో ప్రారంభమైన బిగ్ బాస్ షోలో పాల్గొంది.

English summary
Sanjjanaa recently commented that audience are actually bored of the run-of-the-mill mediocre films being made of late and that is why, reality shows on the TV are gaining popularity. Well her comments apparently didn’t go well with a section of Kannada producers council who immediately lodged a complaint on her in the Kannada film chamber.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu