»   » ప్రముఖ నటి జయంతి పరిస్థితి సీరియస్

ప్రముఖ నటి జయంతి పరిస్థితి సీరియస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Actress Jayanthi Admitted In Hospital

ప్రముఖ దక్షిణాది నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా అస్తమాతో బాధ పడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు బెంగుళూరు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం జయంతికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జయంతి వయసు 73 సంవత్సరాలు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ చిత్రాల్లో ఆయన నటించారు. చిన్న తనంలో తన అభిమాన నటుడు ఎన్టీ రామారావును చూసేందుకు ఆమె స్టూడియోలకు వెళ్లేవారు. అలా ఈ రంగంపై ఆసక్తి పెంచుకుని నటిగా మారారు.

Kannada veteran actress Jayanthi unwell

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో కలిపి వందల చిత్రాల్లో ఆమె నటించారు. కన్నడ, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు.

Read more about: jayanthi జయంతి
English summary
Kannada Veteran Actress Jayanthi is suffering from Asthama. She has been admitted to Vikram Hospital, Bengaluru.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X