For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kantara Controversy: కాంతార చిత్ర బృందానికి షాక్.. ఆ పాట ఎత్తేయమని కోర్టు తీర్పు

  |

  కాంతార.. ఇప్పుడు సినీ ప్రేక్షకుల ఏ నోటా విన్న ఇదే పేరు. ఎందుకంటే ఒక చిన్న సినిమాగా విడుదలై కాంతార చేసిన రచ్చ మాములుగా లేదు. కన్నడ సినీ పరిశ్రమలో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'కాంతార'. ఈ చిత్రాన్ని హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించగా.. అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే, డైరెక్షన్, నటీనటుల యాక్టింగ్, మ్యూజిక్ ఇలా ప్రతి అంశం సినిమాపై సక్సెస్ టాక్ తెచ్చిపెట్టింది. అయితే ఇటీవల ఈ మూవీ ఒక వివాదాన్ని కూడా ఎదుర్కొంది. ఈ వివాదానికి సంబంధించి వచ్చిన తీర్పు కాంతార మూవీ యూనిట్ కు షాకింగ్ న్యూసే అని చెప్పవచ్చు. పూర్తి వివరాళ్లోకి వెళితే..

  పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్..

  పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్..

  ఒక చిన్న చిత్రంగా కన్నడలో విడుదలై ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది కాంతార. ముందుగా కన్నడ భాషలో రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కేజీఎఫ్ వంటి భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించిన హోంబలే ఫిలీంస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దీంతో మరోసారి హోంబలే ఫీలింస్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు హీరోగా, డైరెక్టర్ గా మెస్మరైజ్ చేశాడు రిషబ్ శెట్టి. ఇప్పుడు ఈ చిత్రం కన్నడతోపాటు మూడు భాషల్లో విడుదలై వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. ముఖ్యంగా తెలుగులో కెలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది.

  రిషబ్ షెట్టి నట విశ్వరూపం..

  రిషబ్ షెట్టి నట విశ్వరూపం..

  ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రతి అంశం ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ఈ చిత్రంలో కర్ణాటకలోని తుళునాడులో ఉన్న సంస్కృతులను చక్కగా చూపించారు. ముఖ్యంగా అక్కడి భూతకోల సాంప్రదాయం సినిమాకు హైలెట్ గా నిలిచింది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోపాటు రిషబ్ షెట్టి నట విశ్వరూపం చూపించిన 'వరాహ రూపం' పాట ప్రేక్షకులకే కాదు విమర్శకులు సైతం నోరు వెళ్లబెట్టేలా చేసింది. ఇప్పుడు ఈ పాటే ఈ చిత్రానికి వివాదస్పదమైంది. ఈ 'వరాహ రూపం' పాటను తమ నుంచి కాపీ కొట్టారని 'తాయిక్కుడమ్ బ్రిడ్జ్' అనే మ్యూజిక్ ట్రూప్ ఆరోపించింది. అంతేకాకుండా తమ అనుమతి లేకుండా పాటను తీసుకోవడంపై కోర్టుకు వెళ్లారు.

  'నవరస..' పాటకు కాపీ అని..

  'నవరస..' పాటకు కాపీ అని..

  'తాయిక్కుడమ్ బ్రిడ్జ్' మ్యూజిక్ ట్రూప్ వేసిన పిటిషన్ పై పరిశీలించిన 'కోజికోడ్ సెషన్స్ కోర్టు' కాంతార మేకర్స్ కి షాక్ ఇచ్చింది. ఈ 'వరాహ రూపం' అనే పాటను నిలిపివేయాలని తీర్పునిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేరళలోని థియేటర్లలో, ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో (యూట్యూబ్, ఓటీటీ) వరాహ రూపం పాటను ప్లే చేయకూడదని తెలిపింది. దీంతో ఆ పాట ఇకను చూడలేమని తెలుస్తోంది. కాగా కాంతార విడుదలై కొన్ని రోజులకే ఈ 'వరాహ రూపం' పాటను తాము స్వరపరిచిన 'నవరసం..' పాటకు కాపీ అని 'తాయిక్కుడమ్ బ్రిడ్జ్' మ్యూజిక్ బ్యాండ్ తెలిపింది. కాంతార చిత్రానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ రెండు పాటల మధ్య సారూప్యతలు ఉన్నాయని పేర్కొంది.

  కాపీ రైట్ చట్టాలను ఉల్లంఘించడమే.. ఇది పూర్తిగా కాపీ రైట్ చట్టాలను ఉల్లంఘించడమే అని, ఇన్న్పిరేషన్, కాపీ మా దృష్టిలో ఈ రెండింటికి మధ్య ఉన్న గీత భిన్నమైనదని తెలిపింది. దీంతో వివాదం నెలకొంది. అయితే ఈ వివాదంపై చిత్రబృందం స్పందించకపోవడంతో కోర్టుకెక్కినట్లు తెలుస్తోంది. ఇక తాయిక్కుడమ్ బ్రిడ్జ్ బ్యాండ్ ను మలయాళ సంగీత దర్శకుడు గోవింద్ వసంత, సింగర్ సిద్ధార్థ్ మీనన్ కలిసి స్థాపించారు. మలయాళ హిట్ మూవీ ప్రేమమ్, తమిళ సూపర్ హిట్ చిత్రం 96, సాయి పల్లవి గార్గి చిత్రాలకు గోవింద వసంత సంగీతం అందించారు.

  కాపీ రైట్ చట్టాలను ఉల్లంఘించడమే.. ఇది పూర్తిగా కాపీ రైట్ చట్టాలను ఉల్లంఘించడమే అని, ఇన్న్పిరేషన్, కాపీ మా దృష్టిలో ఈ రెండింటికి మధ్య ఉన్న గీత భిన్నమైనదని తెలిపింది. దీంతో వివాదం నెలకొంది. అయితే ఈ వివాదంపై చిత్రబృందం స్పందించకపోవడంతో కోర్టుకెక్కినట్లు తెలుస్తోంది. ఇక తాయిక్కుడమ్ బ్రిడ్జ్ బ్యాండ్ ను మలయాళ సంగీత దర్శకుడు గోవింద్ వసంత, సింగర్ సిద్ధార్థ్ మీనన్ కలిసి స్థాపించారు. మలయాళ హిట్ మూవీ ప్రేమమ్, తమిళ సూపర్ హిట్ చిత్రం 96, సాయి పల్లవి గార్గి చిత్రాలకు గోవింద వసంత సంగీతం అందించారు.

  Xఇది పూర్తిగా కాపీ రైట్ చట్టాలను ఉల్లంఘించడమే అని, ఇన్న్పిరేషన్, కాపీ మా దృష్టిలో ఈ రెండింటికి మధ్య ఉన్న గీత భిన్నమైనదని తెలిపింది. దీంతో వివాదం నెలకొంది. అయితే ఈ వివాదంపై చిత్రబృందం స్పందించకపోవడంతో కోర్టుకెక్కినట్లు తెలుస్తోంది. ఇక తాయిక్కుడమ్ బ్రిడ్జ్ బ్యాండ్ ను మలయాళ సంగీత దర్శకుడు గోవింద్ వసంత, సింగర్ సిద్ధార్థ్ మీనన్ కలిసి స్థాపించారు. మలయాళ హిట్ మూవీ ప్రేమమ్, తమిళ సూపర్ హిట్ చిత్రం 96, సాయి పల్లవి గార్గి చిత్రాలకు గోవింద వసంత సంగీతం అందించారు.

  English summary
  Kozhikode Session Court Issues Orders To Kantara Makers To Stop Varaha Rupam Song Over Thaikkudam Bridge Music Band Controversy
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X