»   » ‘కంత్రీ మొగుడు’తో వేగేదెలా?

‘కంత్రీ మొగుడు’తో వేగేదెలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ భామ దీపిక పడుకోనే కన్నడలో నటించిన 'ఐశ్వర్య" అనే చిత్రాన్ని తెలుగులో 'కంత్రీ మొగుడు" పేరుతో అనువదిస్తున్నారు. తాజాగా విలక్షన నటుడు ఉపేంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం ఇంద్రజిత్‌ వెంకటేష్‌ దర్శకత్వంలో రూపొందింది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ ఉమామహేశ్వర ఫిలింస్‌ పతాకంపై డి.గోపాలకృష్ణ సమర్పణలో రూప్‌కుమార్‌.వి నిర్మిస్తున్నారు. మాటలు, పాటలు భారతీబాబు వ్రాస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కన్నడలో శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం తెలుగులోనూ దీపికా అభినయంతో పాటు గ్లామర్ కు అస్కారమున్న పాత్రను చేశారు ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నామని నిర్మాత రూప్‌కుమార్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X