»   »  నేను లోకల్ vs నాన్ లోకల్ : ధియేటర్స్ వద్ద రచ్చ తప్పదు

నేను లోకల్ vs నాన్ లోకల్ : ధియేటర్స్ వద్ద రచ్చ తప్పదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ శుక్రవారం రెండు సినిమాలు మనని పలకరించనున్నాయి. అందులో ఒకటి న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'నేను లోకల్' . మరొకటి నాన్ లోకల్ అంటే డబ్బింగ్ చిత్రం కనుపాప. డబ్బింగ్ సినిమా అని అదీ తీసి ప్రక్కన పెట్టాల్సిన సినిమా కాదు. అదీ మళయాళంలో సంచలన విజయం సాదించిన చిత్రమే. దాంతో ఈ వారం ..నేను లోకల్ vs నాన్ లోకల్ అనే చిత్రమైన పోటీ ధియోటర్ లలో కనిపించనుంది.

'నేను లోకల్' విషయానికి వస్తే...దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక నేటితో సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు పక్కాగా సిద్ధమైంది. సెన్సార్ వారు ఈ సినిమా ఎటువంటి కట్స్ చెప్పకుండా 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక రన్‌టైమ్ కూడా ఇప్పుడొస్తున్న కమర్షియల్ సినిమాల్లానే 2 గంటల 15 నిమిషాలే ఉండడం సినిమాకు కలిసివచ్చే అంశం.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి. అదేవిధంగా ఈ సినిమాతో నాని డబుల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్న ప్రచారం జరుగుతూ ఉండడంతో అందరి చూపూ ఇప్పుడు నేను లోకల్ పైనే పడింది. నాని స్టైల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు 'సినిమా చూపిస్తా మావా' ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ నాని సరసన హీరోయిన్‌గా నటించారు. కనుపాప విషయానికి వస్తే..

 సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం

సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం

మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ - ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేష‌న్లో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఒప్ప‌మ్. ఈ చిత్రం మ‌ల‌యాళంలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని క‌నుపాప టైటిల్ తో ఓవ‌ర్ సీస్ నెట్ వ‌ర్క్ ఎంట‌ర్ టైన్మెంట్ తెలుగులో రిలీజ్ చేస్తుంది. దిలీప్ కుమార్ బొలుగోటి స‌మ‌ర్ప‌ణ‌లో మోహ‌న్ లాల్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌నుపాప చిత్రం ఫిబ్ర‌వ‌రి 3న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

 పసివాడి ప్రాణంలా ఉండే చిత్రం

పసివాడి ప్రాణంలా ఉండే చిత్రం

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శ్రీనివాస‌మూర్తి మాట్లాడుతూ...మ‌న్యం పులి త‌ర్వాత తెలుగులో వ‌స్తున్న మోహ‌న్ లాల్ చిత్ర‌మిది. ప‌సివాడి ప్రాణం త‌ర‌హాలో ఉండే విభిన్న క‌థా చిత్ర‌మిది. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ గుడ్డివాడుగా న‌టించారు. హ్యుమ‌న్ వాల్యూస్ ఉన్న క‌నుపాప మూవీ మంచి సినిమాగా తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను కూడా పొందుతుంది అని నా న‌మ్మ‌కం. ఫిబ్ర‌వ‌రి 3న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

 వరంగల్ నుంచి వచ్చా...

వరంగల్ నుంచి వచ్చా...


చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిలీప్ కుమార్ మాట్లాడుతూ...మాది వ‌రంగ‌ల్. ఇండ‌స్ట్రీలోకి రావాలి...మంచి సినిమాలు నిర్మించాలి అనేది నా కోరిక‌. సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి గారి ద్వారా ఈ చిత్రం రైట్స్ తీసుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాను. ఈ చిత్రాన్ని ఆద‌రించి నా తొలి ప్ర‌య‌త్నానికి విజ‌యం అందిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.

 చిరు చేసిన పాత్రనే గుడ్డివాడు చేస్తే..

చిరు చేసిన పాత్రనే గుడ్డివాడు చేస్తే..

నిర్మాత సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ....ప‌సివాడి ప్రాణం సినిమాలో చిన్న‌పిల్లాడిని ర‌క్షించే పాత్ర‌లో చిరంజీవి గారు ఎలా న‌టించారో ...ఆ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. అదే క్యారెక్ట‌ర్ ను గుడ్డివాడు చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ క‌నుపాప‌ క‌థాంశం. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ గారు గుడ్డివాడుగా అద్భుతంగా న‌టించారు. ఇది జెన్యూన్ & ఫ్రెష్ ఫిల్మ్. ల‌వ్ లీ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ సినిమాకి వ‌చ్చిన ఆడియోన్స్ ను ఏమాత్రం నిరాశప‌ర‌చ‌దు. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన‌ట్టుగానే ఖ‌చ్చితంగా తెలుగులో కూడా విజ‌యం సాధిస్తుంది అన్నారు.

 ఇదే టీమ్ ..

ఇదే టీమ్ ..


మోహ‌న్ లాల్, బేబీ మీనాక్షి, విమ‌లా రామ‌న్, అనుశ్రీ, స‌ముద్ర‌ఖ‌ని, నేడుముడి వేణు, రేన్జి ప‌ణిక్క‌ర్, చెంబ‌న్ వినోద్ జోష్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి స్టోరీ - గోవింద్ విజ‌య‌న్, మ్యూజిక్ - 4 మ్యూజిక్ ( ఎల్దోస్, జిమ్, బిబీ, జ‌స్టిన్) లిరిక్స్ - వెన్నెల‌కంటి, వ‌న‌మాలి, అనంత శ్రీరామ్, డైలాగ్స్ - ఎం.రాజ‌శేఖ‌ర్ రెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్ - ఎన్.కె.ఏకాంబ‌రం, ఎడిటింగ్ - ఎం.ఎస్.అయ్య‌ప్ప‌న్ నాయ‌ర్, నిర్మాత - మోహ‌న్ లాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - శ్రీనివాస మూర్తి నిడ‌ద‌వోలు, స్ర్కీన్ ప్లే - డైరెక్ష‌న్ - ప్రియ‌ద‌ర్శ‌న్.

English summary
We all know how brilliantly Chiranjeevi garu performed in 'Pasivadi Pranam' in the role of an adult fighting to save a child's life. 'KanuPapa' is about how it will be like if the hero's character is blind.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu