»   »  నాభార్య ఎఫైర్స్‌ విషయంలో తక్కువేం కాదు : హీరో అయిఉండి పబ్లిక్ గా ఆ మాట

నాభార్య ఎఫైర్స్‌ విషయంలో తక్కువేం కాదు : హీరో అయిఉండి పబ్లిక్ గా ఆ మాట

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాఫీ విత్ కరణ్.. సెలబ్రిటీలు-స్టార్లతో దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చాలా పాపులర్. ఇప్పటికి 4 సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు ఐదో సీజన్ నడుస్తోంది. తనే డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కావడం.. అందరితో వ్యక్తిగతంలో స్నేహం ఉండడంతో.. జనాలకు తెలియని ఎన్నో ప్రశ్నలను డైరెక్టుగా అడిగేస్తుంటాడు కరణ్.

తాజాగా ఆ షోకు బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌, అతని భార్య మీరా హాజరయ్యారు. కరీనా, ప్రియాంక వంటి భామలతో లవ్‌స్టోరీలు నడిపిన షాహిద్‌ను ఆ వ్యవహారాల గురించి పలు ప్రశ్నలు అడిగాడు కరణ్‌. అంతటితో ఆగకుండా షాహిద్‌ భార్య మీరా ప్రేమ వ్యవహారాల గురించి కూడా ప్రశ్నంచాడు. ఈ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా.. 'అన్నీ షాహిద్‌కు చెప్పేశాన'ని బదులిచ్చింది మీరా. అతడు తన ప్రేమకథలన్నీ తనతో చెప్పాడని, అందుకే తను కూడా ఏమీ దాచకుండా షాహిద్‌కు చెప్పేశానని తెలిపింది.

shahid

ఈ సమాధానంతో కరణ్‌ సంతృప్తి చెందలేదు. అందుకే 'నీకు పెళ్లికి ముందు ఎంతమంది బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నార'ని డైరెక్ట్‌గా అడిగేశాడు. అయితే, ఈ ప్రశ్నకు మీరా నుంచి కాకుండా షాహిద్‌ నుంచి సమాధానం వచ్చింది. 'ఎఫైర్స్‌ విషయంలో నా కంటే తక్కువేం కాదు' అని తన భార్య ఎఫైర్ల గురించి బయటపెట్టాడు.

అయితే గత కొన్నాళ్ళుగా ఈ షోలో బూతు ఎక్కువ అవుతోంది అంటూ విమర్షలు వస్తున్నాయి...ఈ మధ్య ఈ ప్రోగ్రామ్‌లో అన్నీ ఇలాంటి ప్రశ్నలే. నువ్వు వర్జిన్‌వా? ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నావు? ఫ్రెండ్‌ లవర్‌తో ఎప్పుడైనా సెక్స్‌ చేశావా? ఇవీ.. ఈ షోకు వచ్చిన సెలబ్రిటీలను హోస్ట్‌ కరణ్‌జోహార్‌ అడిగే ప్రశ్నలు. ఈ తరహా ప్రశ్నలతో కరణ్ షో కి రేటింగ్ పెరగొచ్చు కానీ అతని ఇమేజ్, బయట అతని మీద ఉన్న గౌరవం రెండూ దారుణం గా దెబ్బతినటం మాత్రం ఖాయం అంటున్నారు..

English summary
Going by the latest Koffee with Karan trailer, there is a lot that we will get to know about Mira, including her ex boyfriends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu