»   »  పెళ్లి కాకుండానే తండ్రికాబోతున్న స్టార్ దర్శకుడు

పెళ్లి కాకుండానే తండ్రికాబోతున్న స్టార్ దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Karan Johar
ముంబై : పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న దర్శకుడు అనే విషయం కాస్త వింతగా, క్రేజీగా అనిపించినా.....ఇది నిజమండీ బాబు. బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జోహార్ ఇంకా పెళ్లి చేసుకోని సంగతి తెలిసిందే. 41 ఏళ్లు వచ్చినా ఇంకా ఆడ తోడు లేకుండా ఒంటరిగానే గడుపుతున్నాడు. ఇలాంటప్పుడు మరి తండ్రి ఎలా అవుతున్నాడనే కదా మీ అనుమానం?

ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం...దర్శకుడు కరణ్ జోహార్ త్వరలో ఓ చిన్నారిని దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. సదరు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ విషయం వెల్లడించినట్లు చెబుతున్నారు. అయితే అది ఎప్పుడు? అనేది మాత్రం ఆయన ఖరారు చేయలేదు. మరి ఆ చిన్నారి బాగోగులు ఎవరు చూసుకుంటారు అంటే....నేను, మా అమ్మ ఆ చిన్నారి బాగోలు చూసుకుంటాం అని చెబుతున్నాడు.

41 ఏళ్ల కరణ్ జోహార్ సల్మాన్ ఖాన్ మాదిరి ఇప్పటికీ బ్యాచిలర్‌గా ఉంటున్నాడు. అంతే కాదు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని చాలా సందర్భాల్లో స్పష్టం చేసాడు. అయితే తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, దత్తత తీసుకుని వారిని పెంచుకుని మంచి తండ్రిని అనిపించుకుంటానని వెల్లడించారు కరణ్ జోహార్.

గతంలో బాలీవుడ్లో సుస్మితా సేన్, రవీనా టండన్ పిల్లలు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. సుస్మితా సేన్ అయితే ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోనేలేదు. అయితే రవీనా టండన్ మాత్రం పెళ్లి చేసుకుంది. వీరి మాదిరిగానే కరణ్ జోహార్ కూడా పిల్లలను దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి పెళ్లిపై విరక్తికి కారణం ఏమిటో మాత్రం చెప్పడం లేదు ఈ స్టార్ దర్శకుడు.

English summary
According to a leading daily, filmmaker Karan Johar has decided to adopt a baby anytime soon. During an exclusive interview with a daily, Karan Johar opened up on his future plans to have a baby. When he was asked about his adoption plans, KJo said that he would love to take a step forward to baby adoption and both he and his mother will take care of the child wonderfully.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu