»   » హాయ్ గే..! గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ లు, తండ్రి అయ్యాడు: ట్విటర్లో పిల్లల ఫొటోతో స్టార్

హాయ్ గే..! గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ లు, తండ్రి అయ్యాడు: ట్విటర్లో పిల్లల ఫొటోతో స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్లో దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈకాడా లేనన్ని రూమర్లతో నిరంతరం వార్తల్లో ఉంటూ ఉంటాడు అయితే అతని మీద వచ్చే రూమర్లు ఏ హీరోయిన్ తోనో ఎఫైర్ ఉందనో లేదా ఏ లేట్ నైట్ పార్టీలో అమ్మాయిలతో ఉన్నాడనో కాదు పాపం అతనొక గే అన్న రూమర్ చాలాకాలంగానే ఉంది. తనను అందరూ గే అనుకుంటారని.. రోజూ పొద్దున 'హాయ్ గే.. గుడ్ మార్నింగ్' అంటూ తన మొబైల్ కు మెసేజ్ లు వస్తుంటాయని.. తనలో కొంచెం ఆడంగి లక్షణాలున్న మాట వాస్తవమే అని ఓపెన్ గా మాట్లాడ్డం కరణ్ కే చెల్లింది.

బోల్డ్ గా ఓ వ్యాసం రాశాడు

బోల్డ్ గా ఓ వ్యాసం రాశాడు

కొన్నాళ్ళ కిందట తన సెక్సువల్ లైఫ్ గురించి ఓ ప్రముఖ వెబ్ సైట్లో కరణ్ చాలా బోల్డ్ గా ఓ వ్యాసం రాశాడు. తనకు తొలి సెక్స్ అనుభవం ఎప్పుడు జరిగింది.. తనకు ప్రస్తుతం సెక్స్ కోరికలు ఎలా ఉన్నదీ.. వివరిస్తూ కరణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ మధ్య తన ఆత్మ కథ రాసి విడుదల చేసినప్పటినుండి తన లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయని కరణ్ జోహార్ వాపోతున్నాడు ?

Karan Johar Ready To Marry SRK, Then Kill Aishwarya Rai Bachchan - Filmibeat Telugu
ఏ మగాడితో తిరిగినా

ఏ మగాడితో తిరిగినా

ముఖ్యంగా ఆయనకు మీడియా నుండి వేధింపులు ఎక్కువయ్యాయని అంటున్నాడు ? ఎందుకంటే కరణ్ జోహార్ .. తాను "గే "అని ఆ కథలో చెప్పినప్పడి నుండి. అయన ఏ మగాడితో తిరిగినా అతనితో సంబంధం ఉందా అంటూ ప్రశ్నలు వేసి చంపుతున్నారట ? ప్రస్తుతం మగాళ్లతో బయట కనిపించాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని వాపోయాడు.

హీరో అజయ్ దేవగన్ తో

హీరో అజయ్ దేవగన్ తో

ఈ మద్యే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తో కలిసి కనిపించాడు కరణ్ .. వెంటనే అతనితో మీకు ఆ .. సంబంధం ఉందా ? అంటూ అడుగుతున్నారు అని, ఇద్దరు మగాళ్లు కలిసి డిన్నర్ చేస్తే తప్పేమిటి ? అని ప్రశ్నిస్తున్నాడు ? అవునులే .. అసలు విషయం చెప్పిన తరువాత .. ఏ పని చేస్తున్న ఇలాంటి నిందలు తప్పవుగా మరి !!

తండ్రిని అయ్యాను

తండ్రిని అయ్యాను

అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ మధ్య తాను తండ్రిని అయ్యాను అంటూ కరణ్ పోస్ట్ చేసిన ఫొటో ఒక్కసారి అందరినీ షాక్ చేసింది. అసలు పెళ్ళేకాని కరణ్ తనపిల్లలకు తండ్రి ఎలా అయ్యాడూ అన్న వాళ్ళకి కింద ఉన్న మ్యాట ర్ చూస్తే సలు విషయం అర్థమవుతుంది.

దర్శకుడిగా ,నిర్మాతగానే కాకుండా

దర్శకుడిగా ,నిర్మాతగానే కాకుండా

సరోగసి పద్దతిని ఈ మధ్య సెలబ్రెటీలు కూడా చాలావరకు మొగ్గు చూపిస్తున్నారు. అందులో ఒకరు కరణ్ జోహార్. బాలీవుడ్ లో దర్శకుడిగా ,నిర్మాతగానే కాకుండా మంచి ఫ్యాషన్ డిజైనర్ గా గుర్తింపు తెచ్చుకున్న కరణ్ టెలివిజన్ హోస్ట్ గా కూడా పాపులర్ అయ్యాడు.

సరోగసి ద్వారా

సరోగసి ద్వారా

ఆయన బాహబలి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఎందుకంటే బాహుబలి హిందీ వెర్షన్ ను బాలీవుడ్ లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వస్తే వివాహం చేసుకోని కరణ్ జోహార్ సరోగసి ద్వారా జన్మించిన తన ఇద్దరి పిల్లల పోటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

ఆడపిల్లకు-మగపిల్లాడికి కరణ్ తండ్రయ్యారు

ఆడపిల్లకు-మగపిల్లాడికి కరణ్ తండ్రయ్యారు

ఫీబ్రవరి లో సరోగసి పద్ధతిద్వారా జన్మించిన ఒక ఆడపిల్లకు-మగపిల్లాడికి కరణ్ తండ్రయ్యాడు. కొడుకుకి యష్ జోహార్ అని తన తండ్రి పేరు పెట్టుకోగా కూతురికి రుహి అని నామకరణం చేశాడు. రాఖీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ.. పిల్లలతో తన తల్లి దిగిన ఫోటోను సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు కరణ్ జోహార్.

English summary
Bollywood filmmaker Karan Johar has become the single parent of twins a girl and a boy, born through surrogacy last month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more