»   » ఆ స్టార్ డైరక్టర్ మానసిక పరిస్దితి అసలు బాగోలేదట, ట్రీట్మెంట్ తీసుకుంటూ...

ఆ స్టార్ డైరక్టర్ మానసిక పరిస్దితి అసలు బాగోలేదట, ట్రీట్మెంట్ తీసుకుంటూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినిమావాళ్లు ఏమీ దేవుళ్లు కాదు..వాళ్ళకూ మనలాగే అన్ని ఎమోషన్స్, అన్ని బాధలు, సంతోషాలు ఉంటాయి. అలాగే వాళ్లూ అప్పుడప్పుడూ డిప్రెషన్స్ లోకి వెళ్లటం, మానసిక బాధలతో ఇబ్బంది పడటం జరుగుతూంటుంది. అయితే వాళ్లు మనలాగ ఎక్సపోజ్ కారు. తమ డిప్రెషన్స్, తమ ఆలోచనలు ఏమీ బయిటకు వెళ్లడించరు. కానీ ఎప్పుడైనా వారు ధైర్యం చేసి తాము అలాంటి పరిస్దితిని ఎదుర్కొన్నాం అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది.

ఆ మధ్యన బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో బ్రేకప్‌ అయిన తర్వాత కొన్నిరోజులు డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు దీపికా పదుకొణె వెల్లడించి అందిరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖ దర్శక.. నిర్మాత కరణ్‌ జోహర్‌ కూడా డిప్రెషన్‌కి లోనయ్యానని తాజాగా చెప్పుకొచ్చాడు. ఈ విషయం అంతటా చర్చనీయాంశమైంది. డిప్రెషన్ కు కారణమేంటి అనేది అంతా చర్చించుకుంటున్నారు.


అంతటితో ఆయన ఆగక..తాను మానసిక వ్యాధితో బాధ పడ్డానని, రెండేళ్లు మందులు వాడానని రివీల్ చేసి మరీ షాక్ ఇచ్చారు. మానసిక వైద్యుడుని సంప్రదించాకే తను డిప్రెషన్ లో ఉన్న విషయం తెలిసిందని ఆయన అన్నారు.


బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించిన ఆయన తెలుగు బాహుబలి హిందీ వెర్షన్ కు నిర్మాతగా వ్యవహరించి,దాని భారీ సక్సెస్ కు కారణం అయ్యారు. ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీలు, ప్రమోషన్ ని సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్లాయి. కరుణ్ జోహార్ స్వయంగా చెప్పిన విషయాలు ..ఇవీ..


నమ్మలేం కానీ నిజం

నమ్మలేం కానీ నిజం

కరణ్ జోహార్ మల్టి టాలెంటెడ్ అని అంతా ఒప్పుకుంటారు. ఆయన కోలిగ్స్, స్టార్స్ అందరూ ఆయనంటే చాలా గౌరవం చూపిస్తారు. ఎప్పుడూ నవ్వూతూ, చాలా సరదాగా అందరిపై జోకులు వేస్తూ గడిపే ఆయన మానసిక వ్యాధితో భాధపడ్డారంటే నమ్మలేం, కానీ ఆయనే స్వయంగా చెప్పటంతో నమ్మకం తప్పటం లేదు. తాజాగా ఆయన ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం రివీల్ చేసారు.


సిటీ వదిలిపారిపోయేవాడిని

సిటీ వదిలిపారిపోయేవాడిని

డిప్రెషన్ పీరియడ్ లో తన మానసిక స్దితిని గురించి కరుణ్ జోహార్ వివరిస్తూ... "నేను చాలా హెల్పలెస్ గా ఫీలయ్యేవాడిని, చాలా నిరాసగా అనిపించేది, చాలా విచారం కలిగేది. అందుకు కారణం ఉండేది కాదు. నేను ఈ డిప్రెషన్ ని ఎదుర్కోవటానికి ఎప్పుడూ సిటీని వదిలి పారిపోతూండేవాడిని, ప్లైట్ లలో తిరుగుతూండేవాడిని.


అంతా అయోమయం, అంధకారం

అంతా అయోమయం, అంధకారం

వేరే సిటీల్లో నేను నడుస్తూండేవాడిని, రోడ్డుపై దిక్కు తోచక చక్కర్లు కొట్టేవాడిని. ఎవరితో ఏమీ చెప్పబుద్దేసేది కాదు. ఏమీ మాట్లాడేవాడిని కాదు. నాకు నా హోటల్ రూమ్ బెడ్ పై నుంచి లేవబద్ది వేసేది కాదు. అంతెందుకు ఇదంతా ఎవరితోనూ షేర్ చేసుకోవాలని అని కూడా అనిపించేది కాదు. చాలా డార్క్ గా, అయోమయంగా ఉన్న రోజులు అవి.


ఆ వేదనకు కారణంఇదే

ఆ వేదనకు కారణంఇదే

నా డిప్రెషన్ కు కారణమేంటిని చాలా ఆలోచించేవాడిని, సరైన ఆదారం కానీ, కారణం కానీ దొరికేది కాదు. 44 సంవత్సరాల వయస్సులో నేను డిప్రెషన్ కు వెళ్లటానికి కారణం. రిలేషన్ షిప్ లో లేకపోవటం కావచ్చు. నా జీవితం ఎటు వెళ్తోంది అర్దం కానీ స్దితి. నేను సాధించిన సక్సెస్ గురించి ఎవరికి చెప్పుకోవాలి. మన ఆనందాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవాల్సిన పరిస్దితి రావటం చాలా వేదనకు గురి చేసే అంశం.


ఏమో ఏదో కారణం నన్ను ఇలా ...

ఏమో ఏదో కారణం నన్ను ఇలా ...

ఇది కేవలం మా నాన్న గారు మరణించారన్న బాధతోనే కాదు.. ఇంకా నాకు జీవిత భాగస్వామి దొరకలేదన్న భయంతోనూ కావొచ్చు. చాలామంది స్నేహితులు నన్ను ప్రేమగా చూసుకున్నారు. అయినా.. ఒంటరిగా ఫీలయ్యేవాడ్ని' అని చెప్పుకొచ్చాడు కరుణ్ జోహార్.


స్నేహితులు సైతం నాకు ..

స్నేహితులు సైతం నాకు ..

‘నా జీవితంలో డిప్రెషన్‌కి లోనై.. ఒంటరితనాన్ని అనుభవించిన రోజులున్నాయి. ఆ సమయంలో ఎవరినీ కలిసేవాడిని కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఎంతో ఆనందాన్ని కోల్పోయాను. నాకు చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్లు నన్ను చాలా ఎఫెక్షన్ తో ప్రేమతో చూసుకునే వాల్లు కానీ, నాకు డిప్రెషన్ మాత్రం పోలేదు.


ఎవరు అర్దం చేసుకుంటారు

ఎవరు అర్దం చేసుకుంటారు

ఓ సెలబ్రెటీగా డిప్రెషన్ ని మోయటం చాలా కష్టం అంటున్నారు కరణ్. మీరు ఒంటిరగా ఫీలవుతారు. ఇండస్ట్రీలో ఎంత మంది దాన్ని అర్దం చేసుకుంటారు. కేవలం సినిమాల గురించి మాట్లాడుతూ..సినిమాలతో నే పడుకుంటూ, సినిమాలనే ఆహారంగా తీసుకుంటూ బ్రతికేస్తూంటాం అంటున్నారు.


సినిమా చేసేటప్పుడు ఉన్నంతగా

సినిమా చేసేటప్పుడు ఉన్నంతగా

సినిమా చేస్తున్నప్పుడు రిలేషన్స్ , ఎమోషన్స్ బిల్డ్ అవుతాయి. అందరూ మనవాళ్లే అన్నట్లుగా ఉంటారు, మెలుగుతారు. ఆ తర్వాత మనకు ఆశ్చర్యం వేస్తుంది. కేవలం ఆ సినిమాకోసమేనా ఆ భావోద్వేగాలు. మళ్లి వాళ్ళను కలిసినప్పుడు అవన్నీ ఏమౌతాయి అంటూ కరుణ్ జోహార్ కొంచెం ఎమోషనల్ గా స్పందించారు.


హార్ట్ ఎటాక్ వచ్చినట్లనిపించింది

హార్ట్ ఎటాక్ వచ్చినట్లనిపించింది

‘రెండేళ్ల క్రితం నాకు నా మానసికస్థితి గురించి తెలిసింది. ఒకసారి గుండెపోటు వచ్చిందేమోనని అనుకున్నాను. కానీ.. డాక్టర్‌ని సంప్రదిస్తే ఇది మానసిక వ్యాధి అని, ఏంగ్జైటీ ఎటాక్ అని చెప్పారు. దీంతో వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకున్నాను. రెండేళ్లు మందులు వాడాను. 3 నెలల నుంచి చికిత్సను ఆపేశాను' అని తన మానసిక పరిస్థితిని గురించి బయటపెట్టాడు ప్రముఖ నిర్మాత , దర్శకుడు కరణ్‌ జోహార్.


అవన్నీసెటిల్ చేసుకోవాలి

అవన్నీసెటిల్ చేసుకోవాలి

సైక్రాటిస్ట్ దగ్గరకు వెళ్లాక నాకు అర్దమైంది. కొన్ని ఇంటర్నల్ ఇష్యూలు ఉన్నాయి . వాటిని నేను సెటిల్ చెయ్యలేదు అందుకే ఈ ఏంగ్జైటీ ఎటాక్. అది ఎక్కడికైనా దారి తీయవచ్చు. మందుల కన్నా ముందు నేను వాటిని సెటిల్ చేసుకోవాలి అని అనుకున్నట్లుగా కరుణ్ తెలివారు.


నా పరిస్దితి ఈ రోజు మెరుగైంది

నా పరిస్దితి ఈ రోజు మెరుగైంది

ఏంటి ఏంగ్జైటీ మెడికేషన్ తీసుకున్నాక నా పరిస్దితి పూర్తిగా మెరుగైంది. దాదాపు సంవత్సర పాటు నేను మందులు వాడి మానేసా. నేను ఇప్పుడు నా పరిస్దితి బాగుంది. నా మానసిక పరిస్దితి కూడా ఫెరపెక్ట్ గా ఉంది. నేను ఈ రోజున హ్యాపీనెస్ ని నిజంగా ఫీలవుతున్నాను. ఎప్పుడైతే మనం ఏంగ్జైటీకు లోనవుతామో అప్పుడే మన ఎమోషన్స్ దెబ్బ తిని మన పరిస్దితి దారుణమవుతుందని అర్దం చేసుకున్నాను అన్నారు.


ప్రేమ లేకపోవటమే...

ప్రేమ లేకపోవటమే...

నేను అనేక మెడికల్ సెషన్స్ అయ్యాక నాలో చాలా మార్పు వచ్చింది. ఈ సెషన్స్ లో నేను నా జీవితంలో చాలా పార్శాలను టచ్ చేసాను. నా 11 సంవత్సరంలో మా తండ్రి చనిపోవటంతో ఆ దిగులు అలా ఉండిపోయింది. తండ్రి నుంచి అందవల్సిన ప్రేమ నాకు దొరకలేదు. నేను కొన్ని రిలేషన్స్ షిప్స్ తో బాధ పడ్డాను. అది నా జీవితంలో ఓ బ్యాగేజ్ లాగా నాతోనే వచ్చింది. అలాగే భవిష్యత్ పట్ల భయం ఇవన్నీ నన్ను ఈ స్దితికి తీసుకువచ్చాయి. ఈ రోజున వాటినన్నిటినీ జయించాను అని తెలియచేసారు.English summary
Karan Johar said... “I went through a series of anti-anxiety medication for it. A year and a half post that, when I stopped it, I realised that I am in a much better place. Today I actually feel the emotion of excitement and happiness. When you go through it, you stop feeling that zing of emotion. You stop feeling happiness.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu