»   » మరో తెలుగు సినిమాపై కరుణ్ జోహార్ కన్ను

మరో తెలుగు సినిమాపై కరుణ్ జోహార్ కన్ను

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాహుబలి హిందీ వెర్షన్ కు నిర్మాతగా వ్యవహరించి,భారీగా సక్సెస్ అయిన నిర్మాత కరుణ్ జోహార్. ఇప్పుడు ఆయన దృష్టి మన సౌత్ సినిమాలపై పడింది. సౌత్ సినిమాలను హిందీలో బాగా ఆదరిస్తూండటం గమనించిన ఆయన మరో సౌత్ సినిమాని రీమేక్ చేసే పనిలో పడ్డారు. ఆ సినిమా మరేదో కాదు...

మణిరత్నం డైరక్షన్ లో, మలయాళీ హీరో దుల్హర్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌ జంటగా నటించిన సినిమా ‘ఓకే బంగారం'. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో నిర్మించేందుకు కరణ్‌ జోహార్‌ సన్నాహాలు మొదలుపెట్టారు. గతంలో మణిరత్నం వద్ద సహకార దర్శకుడిగా పనిచేసిన షాద్‌ ఆలీ దీనికి దర్శకత్వం వహిస్తాడు.

మణిరత్నంకు బ్రేక్‌ యిచ్చిన సినిమా ‘ఓ కాదల్‌ కన్మణి'. ముంబై లాంటి సిటీల్లో యువత ఎలా ఉంటోందో, అందుకు పెద్దల సహకారం ఎలా ఉంటుందో వివరిస్తూ తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్ కి సహయకులుగా ప్రకాష్‌రాజ్‌, లీలా శాంసన్‌ నటించారు.

Karan Johar to remake OK Bangaram in Hindi.

మణిరత్నం సినిమాను హిందీలో తీయడం తనకు గౌరవంగా వుందని కరణ్‌జోహార్‌ తెలుపడం విశేషం. ఈ హిందీ వర్షన్‌లో ఆదిత్యరాయ్‌ కపూర్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటించనున్నారని సమాచారం.

కరణ్‌జోహార్‌ ప్రస్తుతం ‘‘అయే దిల్‌హై ముష్కిల్‌'' సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్‌కపూర్‌, అనుష్కశర్మ, ఐశ్వర్యరాయ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే మణిరత్నం కొత్త సినిమా విషయానికి వస్తే...స్క్రిప్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు పూర్తవగానే ఈ సినిమా సెట్స్‌కు వెళ్లనుంది. ఈ సినిమాకు సంబందించి, ఇతర సాంకేతిక నిపునుల కోసం చర్చలు జరుగుతున్నాయి.

English summary
Mani Ratnam Tamil blockbuster 'O Kadhal Kanmani' will be remake in Hindi with one of his former assistants Shaad Ali directing it. Popular Bollywood director Karan Johar will produce the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu