»   » శ్వేతా బసుకి స్టార్ డైరక్టర్ ఛాన్స్? కష్టకాలంలో అండగా ఉంటామన్నవాళ్లు మాత్రం...

శ్వేతా బసుకి స్టార్ డైరక్టర్ ఛాన్స్? కష్టకాలంలో అండగా ఉంటామన్నవాళ్లు మాత్రం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: చిన్నతనంలోనే హీరోయిన్ అయ్యి..ఆ తర్వాత వ్యభిచార కేసులో పట్టుబడి, రకరకాల సమస్యలతో మీడియాకు ఎక్కిన హీరోయిన్ శ్వేతాబసు. అప్పట్లో ఆమెకు చాలా మంది ఆఫర్స్ ఇస్తామని ప్రకటించారు కానీ ఎవరూ ఇవ్వలేదు. సహనటిపై జరిగిన నిరాధార ఆరోపణలను ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. కష్టకాలంలో అండగా ఉంటామన్నారు. తిరిగి తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తామన్నారు. ఇదంతా ప్రచారానికే అని తేలిపోయింది. ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వలేదు.

కానీ ..ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌.. టాలీవుడ్‌ నటి శ్వేతాబసు ప్రసాద్‌తో సినిమా తీయనున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. బాలనటిగా జాతీయ పురస్కారం అందుకున్న శ్వేతాబసు కొత్తబంగారులోకం సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సమస్యల వలయంలో చిక్కుకున్న శ్వేతాకి అవకాశాలు దక్కలేదు.

Karan Johar Ropes Swetha Basu

తాజాగా కరణ్‌ జోహార్‌ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో శ్వేతా బసు హీరోయిన్ గా నటిస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందులో శ్వేతాబసు ఎలాంటి పాత్రలో నటిస్తోంది అన్న వివరాలు కరణ్‌ కానీ శ్వేతా కానీ వెల్లడించలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే శ్వేతాకి మళ్లీ మంచిరోజులు వచ్చినట్లే అంటున్నారు ఆమె అభిమానులు.

శ్వేతాబసు ప్రసాద్ 11 ఏళ్ల ప్రాయంలోనే హిందీ సినిమా మక్డీ ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా ప్రవేశించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా జాతీయ అవార్డును గెలుచుకుంది. కుతుంబ్, కహానీ ఘర్ ఘర్ కరీష్మా కా కరీష్మా, ది మ్యాజిక్ మేకప్ బాక్స్ వంటి హిందీ సీరియళ్లలో లీడ్‌రోల్స్‌లో నటించి విశేష ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది.

Karan Johar Ropes Swetha Basu

అనంతరం కాలంలో నటిగా బెంగాళీ, తెలుగు, తమిళ సినిమాల్లో లీడ్ రోల్స్‌లో నటించింది. శ్వేతాబసు తెలుగు డెబ్యూగా వచ్చిన కొత్త బంగారులోకం మూవీ మంచి కమర్షియల్ విజయాన్ని సాధించింది. తదనంతరం కాస్కో, కలావర్ కింగ్, ప్రియుడు, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా వంటి పలు చిత్రాల్లో నటించింది.

ఆగస్టు 2014లో వ్యభిచారం ఆరోపణలపై శ్వేతాబసు హైదరాబాద్‌లో అరెస్టు అయింది. పలు విచారణల అనంతరం డిసెంబర్ 2014లో నాంపల్లి కోర్టు ఆమెకు క్లీన్‌చిట్ ఇచ్చింది.

English summary
Swetha Basu has bagged a juicy offer from a well known filmmaker Karan Johar .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu