»   » సినిమా చూసి కంటతడి పెట్టాం: కరణ్ జోహార్

సినిమా చూసి కంటతడి పెట్టాం: కరణ్ జోహార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘బజ్రంగి భాయిజాన్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈద్ పండగ సందర్భంగా జులై 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను పలువురు బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.

సినిమా చూసిన అనంతరం కరణ్ జోహార్ స్పందిస్తూ...బజ్రింగి భాయిజాన్ సినిమా ప్రదర్శన ముగిసిన తర్వాత అందరి కళ్లు చెమ్మగిల్లాయి. ఎమోషన్ జర్నీ, సల్మాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ బావుంది అంటూ ట్వీట్ చేసారు.

బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు. అభిమానులు ఆయన తాజా సినిమా ‘భజ్రంగి భాయిజాన్' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం అపీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ అదిరిపోయింది. తర్వాత కరీనా కపూర్ నటించిన మేరా నామ్ మేరా స్పెషల్ సాంగుకు కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీస్ సిద్ధికీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి విందులా ఈ చిత్రం ఉండబోతోంది.

Karan Johar ‏tweet about Bajrangi Bhaijaan

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్... పవన్ కుమార్ చతర్వేది పాత్రలో హనుమంతుడి భక్తుడిగా కనిపించబోతున్నారు. అందరూ అతన్ని బజ్రింగి అని పిలుస్తుంటారు. చెవిటి మూగ అయిన పాకిస్థాన్ చిన్నారిని కలుస్తాడు. సినిమా ఆ చిన్నారి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు కథ అందించింది ప్రముఖ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.

English summary
"There wasn't a dry eye at the end of the screening of BajrangiBhaijaan....an emotional journey majestically performed by SalmanKhan!!" Karan Johar ‏tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu