twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే నా మీద కేసు పెట్టారు.. వాళ్ళను ఎదిరించారని ఇలా.. కరాటే కళ్యాణి సంచలనం

    |

    సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి మరోసారి చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఆమె మీద జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌ లో కేసు నమోదైంది. ఎప్పుడు వివాదాస్పద అంశాల్లో ఉంటూ, రోజు వార్తల్లో ఉండే కరాటే కళ్యాణి వ్యవహారం సంచలనంగా మారింది. నిన్న ఆమె మీద కేసు నమోదు కాగా ఈ రోజు ఆమె ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    హత్య వివరాలు

    హత్య వివరాలు

    ఓ హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించింది అనే ఫిర్యాదు రావడంతో జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై జరిగిన హత్య వివరాలు డిస్ క్లోజ్ చేసేందుకు ఆమె ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.

    ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు

    ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు

    ఇందుకు సంబంధించి జగత్గిరిగుట్ట, ఎల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన తూటంశెట్టి నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఆమె మీద వెంటనే కేసు నమోదు చేయాలని రంగారెడ్డి కోర్టు ఆదేశించింది. కోర్ట్ ఆదేశాల ప్రకారం కరాటే కళ్యాణి పై జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

    అమాయక హిందువుల నుంచి

    అమాయక హిందువుల నుంచి

    ఈ విషయం మీద కరాటే కళ్యాణి స్పందించారు. ఓ ఆధ్యాత్మిక సంస్థ హిందూ మ‌తం పేరుతో ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు వ‌సూల చేస్తుంటే ప్ర‌శ్నించినందుకు త‌న‌పై త‌ప్పుగా వార్త‌లు రాయించి ట్రోల్ చేస్తున్నారంటూ క‌ళ్యాణి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని శివశక్తి ఫౌండేషన్‌ ఓ దుష్టశక్తి అని ఆమె అభివర్ణించారు. అమాయక హిందువుల నుంచి ఈ ఫౌండేషన్ విరాళాలను సేకరిస్తోందని.. వాటిని సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

    నిధులను దారి మళ్లించి

    నిధులను దారి మళ్లించి

    శివశక్తి ఫౌండేషన్‌లో పాత సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి నిధులను దారి మళ్లించారని ఆమె అన్నారు. శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం ఏర్పాటుకు రెండున్నర కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేస్తున్నారు, శివశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు కరుణాకర్ సుగ్గున, డైరెక్టర్లు దేవిరెడ్డి ఆనందకుమార్ రెడ్డి, సునీతారెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కళ్యాణి విమర్శలు చేశారు.

    ప్రశ్నించినందుకు

    ప్రశ్నించినందుకు


    శివశక్తి ఫౌండేషన్‌లో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తనను ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శివశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు, డైరెక్టర్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని.. శివశక్తి ఫౌండేషన్ అక్రమాలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కరాటే కళ్యాణి తెలిపారు. శివశక్తి ఫౌండేషన్‌కు హిందువులు ఎవరూ విరాళాలు ఇవ్వొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

    బీజేపీ తీర్థం

    బీజేపీ తీర్థం

    ఇక నటి కళ్యాణి గత ఆగస్టు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ నేతృత్వంలో బీజేపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. కరాటే కళ్యాణి తో పాటు ఆమె అనుచరులు 10 మంది పార్టీలో చేశారు. అప్పటి నుంచి ఆమె సినిమాల కంటే ఎక్కువ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటున్నారు.

    English summary
    Karate Kalyani sensational allegations on Shivashakthi foundation
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X