twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్‌పై కల్యాణీ సంచలన వ్యాఖ్యలు: సెట్‌లో అలాంటి ప్రవర్తన.. కేసీఆర్, జగన్‌ అంటూ!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. దీని కోసం విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కొందరు సినీ పెద్దలు సైతం ప్రకాశ్ రాజ్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై ప్రముఖ నటి కరాటే కల్యాణీ స్పందించారు. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఓట్ ఎవరికి వేయాలో అన్న విషయంపైనా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సంగతులు మీకోసం!

    ‘మా' ఎన్నికలకు టాలీవుడ్ సన్నద్ధం

    ‘మా' ఎన్నికలకు టాలీవుడ్ సన్నద్ధం

    తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఆర్టిస్టుల సమస్యల పరిష్కారం కోసం.. పరిశ్రమను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేసేందుకు ఏర్పాటైన సంఘమే 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్'. ఇందులో నిర్ణీత కాల వ్యవధికి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఒక అధ్యక్షుడితో పాటు ప్యానెల్ సభ్యులను ఎన్నుకుంటారు. ఇక, ఈ ఏడాది కొద్ది రోజుల్లో మా ఎన్నికలకు టాలీవుడ్ సన్నద్ధం అవుతోంది.

    పోటీలో నలుగురు సినీ ప్రముఖులు

    పోటీలో నలుగురు సినీ ప్రముఖులు

    'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' అధ్యక్ష పదవికి ప్రతి సారీ రెండు బలమైన వర్గాలు పోటీలో నిలుస్తున్నాయి. అయితే, ఈ సారి మాత్రం ఇండస్ట్రీ నుంచి ఏకంగా నలుగురు ప్రముఖులు పోటీలో ఉన్నారు. కొద్ది రోజుల్లో జరగబోతున్న ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలు పోటీ పడబోతున్నారు. దీంతో ఈ సారి పోటీ రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.

    ఎవరికి ఎవరు మద్దతు తెలుపారంటే

    ఎవరికి ఎవరు మద్దతు తెలుపారంటే

    మా అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న నలుగురికి కొందరు ప్రముఖులు సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రకాశ్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ, మంచు విష్ణుకు సీనియర్ నటులతో పాటు నందమూరి కుటుంబం మద్దతు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, జీవితా రాజశేఖర్‌కు లేడీ ఆర్టిస్టులు, కొత్త నటులు.. హేమకు చిన్న ఆర్టిస్టుల మద్దతు ఉందనే టాక్ బాగా వినిపిస్తోంది.

    ఎన్నికలపై కరాటే కల్యాణీ స్పందన

    ఎన్నికలపై కరాటే కల్యాణీ స్పందన

    'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది నటులు తమకు నచ్చిన వారికి మద్దతుగా, నచ్చని వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో 'మా' సభ్యురాలు కరాటే కల్యాణీ ఈ ఎన్నికలపై స్పందించారు. పోటీ పడుతోన్న వారిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

    స్థానికత అంశాన్ని లేవనెత్తిన కల్యాణీ

    స్థానికత అంశాన్ని లేవనెత్తిన కల్యాణీ

    తాజాగా కరాటే కల్యాణీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పోటీ చేయడం నాకు నచ్చలేదు. తమిళ సినీ ఇండస్ట్రీలో వెళ్లి తెలుగు వాళ్లు పోటీ చేస్తే ఒప్పుకుంటారా? అసలు అక్కడ మనం పోటీ చేయగలమా? అలాంటప్పుడు వేరే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని ఇక్కడ ఎలా పోటీ చేయనిస్తారు? ఇక్కడ అధ్యక్షులను ఎలా చేస్తారు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారామె.

    కేసీఆర్‌, జగన్ పేర్లను వాడుతూ అలా

    కేసీఆర్‌, జగన్ పేర్లను వాడుతూ అలా

    మా ఎలెక్షన్‌ను పాలిటిక్స్‌ ముడిపెట్టిన కల్యాణీ.. 'తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బాగా పరిపాలిస్తున్నారని ఆయనను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయిస్తామంటే మనం ఒప్పుకుంటామా? ఎందుకంటే ఇక్కడ కేసీఆర్, జగన్ లాంటి వారు ఉన్నారు. కాబట్టి మన నటులు ఉన్నప్పుడు వేరే వాళ్లకు ఎందుకు సపోర్ట్ చేయాలి. నేనైతే ఆయను ఓట్ వేయను' అని డైరెక్టుగా చెప్పేశారు.

    సెట్‌లో అలాంటి ప్రవర్తన అని చెప్తూ

    సెట్‌లో అలాంటి ప్రవర్తన అని చెప్తూ

    ఇక, ప్రకాశ్ రాజ్ ప్రవర్తన గురించి మాట్లాడుతూ.. 'సెట్స్‌లో ఉన్నప్పుడు ప్రకాశ్ రాజ్ గారు సహాయ నటులతోనే సరిగా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా అదోలా ప్రవర్తిస్తుంటారు. అందుకు నేనే ఒక ఉదాహరణ. కో స్టార్లతోనే సరిగా ఉండని వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుడిని చేస్తానంటే నేనైతే ఒప్పుకోను. తెలుగు వాళ్లే మా అధ్యక్షులు అవ్వాలి' అంటూ నిర్మొహమాటంగా చెప్పారు కరాటే కల్యాణీ.

    English summary
    Tollywood Actor Karate Kalyani Recently Participated in An Interview. In This Chit Chat.. She Respond on MAA Elections 2021. And Also She Sensational Comments on Prakash Raj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X