twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెమ్యూనరేషన్ సమస్య కాదు ‘హీరోయిన్’ నా డ్రీమ్ రోల్...!

    By Sindhu
    |

    బాలీవుడ్ సంచలన దర్శకుడు మధుర్‌భండార్కర్ కలల ప్రాజెక్ట్ 'హీరోయిన్" అర్థాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఐశ్వర్యరాయ్ కథానాయికగా ఈ సినిమాని ప్రారంభించిన మధుర్ కొన్ని నెలల క్రితం ఆమె ప్రెగ్నెట్ అని తెలియడంతో ప్రాజెక్ట్‌ ను నిలిపివేశాడు. దాదాపు అరవైశాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం నుంచి ఐశ్వర్య తప్పుకోవడంతో ఈ సినిమా భవిష్యత్తు సందిగ్ధంలో పడినట్లెంది. ఎట్టకేలకు కరీనాకపూర్‌ ను కథానాయికగా ఎంచుకొని ఈ సినిమాని పునఃప్రారంభించాడు దర్శకుడు మధుర్‌ భండార్కర్. ఇటీవలే ఈ చిత్రం ముంబయ్‌ లో తిరిగి ప్రారంభమైంది. హీరోయిన్స్ జీవితాల్లోని చీకటి కోణాల్ని, వారి తెర చాటు జీవితాన్ని ఆవిష్కరిస్తూ మధుర్ రూపొందించనున్న ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండటంతో కరీనా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. తన కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోయే పాత్ర అని గర్వంగా చెబుతోంది.

    ఈ చిత్రానికి కరీనా 10 కోట్ల పారితోషికంతో పాటు చిత్ర లాభాల్లో వాటాను కూడా తీసుకోనుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై కరీనా తనదైన శైలిలో స్పందించింది...'నా కేరీర్‌లో హీరోయిన్ చిత్రం ఎంతో ప్రత్యేకం. హీరోయిన్స్ జీవితం తాలూకూ మనకు తెలియని, ఊహించని ఎన్నో విషయాల్ని దర్శకుడు మధుర్ భండార్కర్ ఈ చిత్రంలో మన కళ్లముందుంచుతున్నాడు. ఈ సినిమాకి నేను తీసుకుంటున్న పారితోషికం ఎంతన్నది సమస్యకాదు...నేను కలలు గన్న డ్రీమ్ రోల్ ఇది. ఈ సినిమా విషయంలో పారితోషికం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు" అని సమాధానమిచ్చింది. దర్శకుడు మధుర్‌భండార్కర్ కూడా హీరోయిన్ సినిమాకి కరీనా రైట్ ఛాయిస్ అని కితాబిచ్చాడు

    English summary
    Shooting for Heroine began over the weekend in grand style. National Award-winning filmmaker Madhur Bhandarkar and Kareena Kapoor were present on the sets as the red carpet was laid out for the scene.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X