»   »  కరీనా చిన్నపిల్ల, పదేండ్లు చిన్నది.. ఏడాదిపాటు మాట్లాడుకోలేదు

కరీనా చిన్నపిల్ల, పదేండ్లు చిన్నది.. ఏడాదిపాటు మాట్లాడుకోలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కల్ హో నా హో చిత్రం సందర్భంగా కరీనాతో విభేదాలు చోటుచేసుకున్నాయని, ఆ తర్వాత ఏడాది పాటు మాట్లాడుకోలేదని ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ పేర్కొన్నారు. కరీనాతో విభేదాలు, బాలీవుడ్ అగ్రనటులతో ఉన్న సంబంధాల గురించి కరణ్ తన ఆటోబయోగ్రఫీ 'యాన్ అన్ సూటబుల్ బాయ్' పుస్తకంలో వెల్లడించారు. కల్ హో నా హో చిత్రంలో నటించాలని కోరగా షారుక్ తో సమానంగా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేసిందని, అది నచ్చకపోవడంతో ఆమె స్థానంలో ప్రీతి జింటాను తీసుకొన్నానని పుస్తకంలో తెలిపారు. ఒకే సినిమాలో ఇద్దరు హీరోలకు స్థానం లేదని ముఖంపైనే చెప్పానని పేర్కొన్నారు.

Kareena and I didn't speak to each other for almost a year

'పలు పార్టీల్లో కలుసుకొన్నాం. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం తప్పితే మాట్లాడుకోలేదు. అలా ఏడాది గడించింది. ఆ సంఘటనలు తలుచుకొంటే పిచ్చిగా అనిపిస్తుంది'అని వెల్లడించారు. కరీనా అగ్రతారగా రాణిస్తున్నప్పటికీ తన దృష్టిలో చిన్న పిల్లేనని, తన కంటే పదేండ్లు చిన్నదని పుస్తకంలో రాశారు.

ఇటీవల విడుదల చేసిన తన జీవిత చరిత్రలో బాలీవుడ్ నటులతో ఉన్న సంబంధాలను దర్శకుడు కరణ్ జోహర్ వెల్లడించారు.

English summary
Kareena and I didn't speak to each other for almost a year
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu