»   » పేరు మార్చుకున్న కరీనాకపూర్

పేరు మార్చుకున్న కరీనాకపూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ పేరు మార్చుకున్నారు. ఆమె వివాహం సైఫ్ అలీ ఖాన్ తో అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమె తన భర్త పేరు కలిసి వచ్చేలా కరీనా కపూర్ ఖాన్ అని మార్చుకుంది. ఆమె తాజా చిత్రం సత్యాగ్రహ టైటిల్స్ లో ఆమె పేరు ఈ మార్పుతో కనపడుతుంది. అవి నీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా మధ్యతరగతి జరిపే పోరాటమే ఈ సినిమా ఇతివృత్తం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చ న్, అర్జున్ రాంపాల్, మనోజ్‌బాజ్‌పాయ్, కరీనాకపూర్, అమృ తారావ్ తదితరులు నటిస్తున్నారు. సత్యాగ్రహ సిని మాలో సామాజిక కార్యకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన వ్యక్తి పాత్రలో అజయ్ కనిపించనున్నాడు.

ఇక ముంబయిలో మహిళా ఫొటోగ్రాఫర్‌పై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై సిని పరిశ్రమ తీవ్ర స్దాయిలో మండిపడుతోంది. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వారి భద్రతకు భరోసా కలిగించేలా కఠిన చట్టాలను తీసుకురావాల్సిన సమయం వచ్చిందని బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ అభిప్రాయపడ్డారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పందించారామె.

కరీనా మాట్లాడుతూ... 'గ్రామాలు, నగరాలన్న తేడా లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తెలుస్తున్నవి కొన్నే. తెలియనివెన్నో! బహుశా నిరక్షరాస్యతే ఇందుకు కారణం కావచ్చు . ఇలాంటి అకృత్యాలపై ప్రజలను జాగృతం చేయడంలో మీడియా పాత్ర కీలకమని, నేరగాళ్లనూ ప్రముఖంగా పేర్కొనాల్సి ఉందన్నారు.

సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సినిమాలు పరిష్కారం చూపలేవని, అవి కేవలం వినోదం పంచడానికేనని చెప్పారు. అయితే సినిమాలు ప్రజల్లో మంచి స్ఫూర్తి నింపడం గొప్ప విషయమన్నారు. 'మేం నటులం. రాజకీయ నాయకులం కాదు. పరిస్థితుల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది' అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన సోదరి కుమార్తె(6)ను మంచి వాతావరణంలో పెంచాలనుకుంటున్నామని... ఆమెకు 16 ఏళ్లు వచ్చేసరికైనా పరిస్థితుల్లో మార్పు రావచ్చని ఆకాంక్షించారు.

English summary
Kareena Kapoor Khan. That’s how her name appears in the credits of Satyagraha. She got married last year. Talaash released soon after. But her name flashed as Kareena Kapoor in the opening credits. However, in her second release after her shaadi, she has added Khan to her name. Actors are known to be paranoid about changing names especially when their career is going great. It’s common for actors to experiment with different spellings for the luck factor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu