»   » సిక్స్ ప్యాక్ బాడీతో సెక్సీ హీరోయిన్!

సిక్స్ ప్యాక్ బాడీతో సెక్సీ హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్ గతంలో జీరో సైజు బాడీతో సెక్సీగా తయారై అభిమానుల మతి పోగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సారి కరీనా మరో అడుగు ముందుకేసి సిక్స్ ప్యాక్ కండలతో కనిపించబోతోంది. 'శుద్ధి' పేరుతో రూపొందబోతున్న బాలీవుడ్ చిత్రంలో కరీనా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనుందట.

కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడం కోసం కరీనా కపూర్ చాలా స్ట్రిక్ట్‌గా డైట్ మెయింటేన్ చేయబోతోందట. ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో ప్రతి రోజూ వర్కౌట్లు చేస్తూ ఆరు పలకల బాడీ కోసం కసర్తుతులు చేస్తోందట.

భారతీయ సినీ పరిశ్రమలో హీరోలు సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించడం మామూలే కానీ.....హీరోయిన్లు ఎవరూ కూడా ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించలేదు. తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీ‌తో కనిపించి కరీనా సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. మరి సిక్స్ ప్యాక్‌లో కరీనా సెక్సీగా ఉంటుందో? మగరాయుడిలా ఉంటుందో? చూడాలి.

ప్రస్తుతం కరీనా కపూర్ 'గోరి తెరా ప్యార్ మే' చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత తన సిక్స్ ప్యాక్ బాడీ మోయింటనెన్స్‌పై పూర్తి దృష్టి పెట్టబోతోంది. హృతిక్ రోషన్ లాంటి కండల వీరుడితో పోటీ పడి కరీనా సిక్స్ ప్యాక్ ట్రై చేయడం అంటే పెద్ద సవాలే మరి!

English summary
Bollywood actress Kareena Kapoor had once set the size zero trend in the town and now she is up for a new challenge. Kareena will be sporting six-pack abs for her upcoming film titled Shuddhi. This movie which is being made by Karan Malhotra also stars Hrithik Roshan in the lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu