»   » సిని తారల వాడే సబ్బు కదా...ఆ మాత్రం సరదా ,కలరింగ్ ఉంటుంది (ఫొటోలు)

సిని తారల వాడే సబ్బు కదా...ఆ మాత్రం సరదా ,కలరింగ్ ఉంటుంది (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: ఎప్పటిలాగే లక్స్ అవార్డ్ లు గ్రాండ్ గా ముగిసాయి. బాలీవుడ్ మీడియా అంతా ఈ అవార్డ్ పంక్షన్ ని ఓ రేంజిలో ప్రసారం చేసింది. అలాగే లక్స్‌ గోల్డెన్‌ రోస్‌ అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్స్ అంతా మెరిసిపోయారు. కళ్లు చెదిరే దుస్తులు ధరించి రెడ్ కార్పెట్ పై నడిచి,చూసే వారికి ఆనందం కలిగించారు. ఈ అవార్డ్ ల వేడుకలో గర్బిణిగా ఉన్న కరీనాకపూర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె ఎర్రతివాచీపై నడిచి వివిధ ఆకారాల్లోని ఎమోజీలను పట్టుకొని అచ్చం వాటిలాగే ఉన్న హావభావాలు ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫొజులిచ్చారు.

బాలీవుడ్‌ నటీనటులు శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌, షర్మిలా ఠాగూర్‌, దీపికా పదుకొణె, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌, తమన్నా, శ్రియ, ఇలియానా, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌, పూజా హెగ్దె, మలైకా అరోరా, అదితి రావ్‌, తాప్సీ, షాహిద్‌ కపూర్‌, అర్జున్‌కపూర్‌, జాకీ ష్రాఫ్‌తో పాటు పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఇక వీరందరూ ఎక్కువగా లక్స్‌ సబ్బు ప్రచార కర్తలుగా ప్రకటనల్లో కనిపించారు. ఆ ఫొటోలు మీరు క్రింద చూడవచ్చు.

అదరకొట్టింది

అదరకొట్టింది

పైన చెప్పుకున్నట్లు కరీనా కపూర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఈ అవార్డ్ ల వేడుకలో నిలిచింది. అందరూ ఆమె గురించే మాట్లాడుకున్నారు. అసలు గర్బవతిగా ఉన్న ఆమె ఇలా వచ్చి రెడ్ కార్పెట్ పై నడుస్తుందని ఎవరూ ఊహించలేదు. దాంతో ఆమె సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.

వావ్ ..దీపికా

వావ్ ..దీపికా

ఇక ఈ అవార్డ్ వేదిక లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ దీపిక పదుకోని. ఆమె తన సెక్సీ లుక్ తో ఈ వేడుకకు అందం తెచ్చింది. మీడియా దృష్టినంతటినీ ఆమె తన వైపుతిప్పేసుకుంది. అంత సెక్సీ డ్రస్ లో రావటం ఆమె అభిమానులకు పండుగ చేసినట్లైంది. ఈ పంక్షన్ లో కరీనా తర్వాత ఆమె ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.

కత్రినాకు సాటి ఎవరు

కత్రినాకు సాటి ఎవరు

ఇక బాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సైతం ఈ అవార్డ్ ల వేడుకలో పాల్గొన్నారు. ఆమె అందానికి ఎవరు సాటి అన్నట్లుగా రెచ్చిపోయింది. ఫెరఫెక్ట్ లుక్ అంటే ఈమే అన్నట్లు మెరిసిపోయింది. కత్రినా అభిమానులకు ఈ వేడక ఓ ఆనందాన్ని మగిల్చిందనే చెప్పాలి.

షారూఖ్ ఖాన్

షారూఖ్ ఖాన్

బ్యాక్ స్టేజిపై షారూఖ్ ఖాన్ ఇలా సూపర్ కూల్ గా కనిపించారు. ఆయన రావటంతో పంక్షన్ కు నిండుతనం వచ్చింది. మోడల్ సుమిత్ర బెనర్జీతో కలిసి ఆయన ఇలా ఫొజ్ ఇచ్చారు. ఆయన తన స్టైల్ తో ఐకాన్ లా అదరకొట్టారు. నిజమే కదా ...

అనుష్క, అర్జున్ లతో

అనుష్క, అర్జున్ లతో

ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన స్టార్ సెలబ్రెటీ , హీరోయిన్ కరీనా కపూర్ ఇలా మరో హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి ఫోజిచ్చారు. అలాగే అర్జున్ కపూర్ తోనూ ఆమె ఇలా వేడకకు వచ్చారు.

ఎవరో గుర్తు పట్టారా

ఎవరో గుర్తు పట్టారా

అవును ఈ క్రింద హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..అదే నండి ఒకప్పుడు బాలీవుడ్ ఒక ఊపు ఊపిన మాధురి ధీక్షిత్. అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన ఆమె మ్యారేజ్ చేసుకుని సెటిలై మళ్లీ ఈ మధ్యనే ఇండస్ట్రీకి వచ్చింది. ఇదిగో ఇలా అప్పుడప్పుడూ మెరుస్తోంది.

స్టార్ దిగివచ్చిన వేళ

స్టార్ దిగివచ్చిన వేళ

స్టార్స్ అంతా ఒకేసారి స్టేజిపై కనిపిస్తే...ఎవరిని చూడాలి. మన కళ్ళు సరిపోతాయా..ఇలాంటి పరిస్దితే లక్స్ అవార్డ్ ల పంక్షన్ లో కనపడింది. షారూఖ్ తో సహా అంతా ఒక్కసారిగా మెరిసారు. దుమ్ము రేపారు. ఈ ఫొటో చూడండి. ఎవరెవరో గుర్తు పట్టండి.

బ్యూటీ సీక్రెట్

బ్యూటీ సీక్రెట్

లక్స్ అంటేనే బ్యూటీ ని పెంచే సబ్బు, సినిమా తారల వాడే సబ్బు అన్నట్లుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. మరి అలాంటి పంక్షన్ కు వచ్చినప్పుడు ఎంత అందంగా మెరిసిపోవాలి . అదే విషయం గుర్తుంచుకున్నట్లు ఉంది.

ఎంతలా మెరిసిపోతోందో

ఎంతలా మెరిసిపోతోందో

ఇక అనుష్క శర్మ గురించి ఎప్పుడూ చెప్పాల్సిన పనిలేదు. ఆమె తెరమీద మెరిపించే మెరులు ఎప్పుడూ అద్బుతంగానే ఉంటాయి. మరి తెరవెనక కూడా అంతే అందంగా ఉంటుందా..మెరుస్తుందా అంటే ఇదిగో మనికి ఈ అవార్డ్ పంక్షనే సాక్ష్యం . ఇక్కడ ఆమె మెరిసిపోతూ దర్శనమిచ్చింది.

ఎవరీ ముద్దుగుమ్మ

ఎవరీ ముద్దుగుమ్మ

ఆమెను ఇలా చూసిన ప్రతీ ఒక్కరూ ఆమెతో ప్రేమలో పడిపోవాల్సిందే అన్నట్లుగా ఉంది కదూ అదితిరావు. ఆమె తన అందంతో మైమరిపిస్తూ ఇలా మెరిసిపోయి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆమె అందానికి అందం అని బాలీవుడ్ మీడియా పొగిడేసింది.

కత్రినా అంటే అంతే మరి

కత్రినా అంటే అంతే మరి

కత్రినా కైఫ్ స్టేజిపైకి వచ్చిందంటే ఆ కిక్కే వేరు అంటారు నిర్వాహకులు. అందుకే ఎంత కష్టమైనా ఆమెను తన పంక్షన్స్ కు తీసుకురావటానికి ట్రైచేస్తూంటారు. ఆమె స్టేజి పైకి ఎక్కిందంటే కూల్ గా ఉన్న వాతావరణం కాస్తా హాట్ గా మారిపోతుంది. ఇక్కడ అదే జరిగింది.

హే..హ్యాండ్సమ్

హే..హ్యాండ్సమ్

ఇక ఈ అవార్డ్ ల పంక్షన్ లో షాహిద్ కపూర్ ఓ రేంజిలో మెరిసిపోయాడు. అందరూ హ్యాండ్సమ్ అని పిలిచారు. అందరినీ విష్ చేస్తూ..షాహిద్ హంగామాగా కనిపించి అలరించారు. ఆయన ఫ్యాన్స్ ఈ ఫొటోలను విరివిగా సోషల్ మీడియాలో షేర్ చేసారు.

బేబో..నువ్వు గ్రేట్

బేబో..నువ్వు గ్రేట్

ఈ అవార్డ్ ల పంక్షన్ లో రెడ్ కార్పెట్ లో నడవటం ద్వారా కరీనా కపూర్ ..ప్రెగ్నింట్ గా ఉన్నా కూడా ఇలా బయిటకు వచ్చి షో బేసెడ్ పోగ్రామ్స్ లో సరదాగా పాల్గొనవచ్చు అని చెప్పినట్లు అయ్యింది. గతంలో ఎప్పుడూ మన సెలబ్రెటీలు ..ప్రెగ్నింట్ గా ఉన్నప్పుడు తన ఫొటోలు బయిటకు రావటానికి ఇష్టపడిన దాఖలాలు లేవు ..

English summary
From Shahrukh Khan to Kareena Kapoor Khan,Deepika Padukone to Katrina Kaif, many Bollywood celebs graced the red carpet of Lux Golden Rose Awards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu