»   » ఆమె జీన్స్ లోనే నటన ఉంది: సవతి కూతురుపై టాప్ హీరోయిన్ కామెంట్

ఆమె జీన్స్ లోనే నటన ఉంది: సవతి కూతురుపై టాప్ హీరోయిన్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'సారా అందమై అమ్మాయే కాదు.. చాలా ఇంటెలిజెంట్ కూడా. అంతేగాక తను బాగా డేరింగ్. తను మంచి నటి అవుతుందనే నమ్మకముంది. స్క్రీన్ పై సారా యాక్టింగ్ చూడాలని నేను సైఫ్ ఎదురుచూస్తున్నాం' అంటోంది కరీనా. సైఫ్ అలీఖాన్ కి మొదటి భార్య అమృతా సింగ్ తో జన్మించిన సంతానమే సారా ఆలీ ఖాన్. కరీనాకి బ్రదర్ వరసయ్యే ఇషాన్ ఖట్టర్ సారా తొలి చిత్రంలో నటిస్తుండడం విశేషం.

సారా అలీ ఖాన్

సారా అలీ ఖాన్

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు బాలీవుడ్ లో ఇటీవల హాట్ టాపిక్ అయింది. దీనికి తోడు సారా అలీ ఖాన్ కు సంబంధించిన హాట్ ఫొటోలు కూడా సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుండడం చర్చనీయాంశం అయింది.

సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్

సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్

సారా సినిమాల్లోకి రావడంపై సైఫ్... కూడా సుముఖంగానే ఉన్నాడు. సైఫ్ ఆల్రెడీ సినిమా కుటుంబం నుండి వచ్చినవాడే. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ నిన్నటితరం బాలీవుడ్ స్టార్ హీరోయిన్. సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ కూడా హీరోయినే. సైఫ్ రెండో భార్య కరీనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్.

Sridevi Memorized her Career Starting days in film industry
పాజిటివ్ ఫీడ్ బ్యాక్

పాజిటివ్ ఫీడ్ బ్యాక్

సైఫ్ సోదరి సోహా అలీ ఖాన్ కూడా బాలీవుడ్ నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ నేపథ్యం, పెరిగిన ప్రపంచం అంతా కూడా సినిమానే కావడంతో సారా కూడా ఇటు వైపే అడుగులు వేసింది. తన కూతురు త్వరలో సినిమాల్లోకి వస్తుండటం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంపై సైఫ్ చాలా హ్యాపీగా ఉన్నాడట. ఆమె చాలా అందంగా ఉంది, హాట్ గా ఉంది, బాలీవుడ్ హీరోయిన్ గా రాణించే అవకాశం ఉందని మీడియా నుండి, అభిమానుల నుండి కామెంట్స్ వస్తుండటంతో సైఫ్ సంతృప్తిగానే ఉన్నాడట.

మోహిత్ సూరీ మూవీలో

మోహిత్ సూరీ మూవీలో

మోహిత్ సూరీ మూవీలో తెరంగేట్రానికి సిద్ధమైంది. సారా అరంగేట్రంపై సైఫ్ అలీఖాన్ రెండో భార్య - సారాకి సవతితల్లి అయిన కరీనా కపూర్ సానుకూలంగా స్పందించింది. సారా ఖచ్చితంగా మంచి నటి అవుతుందని బెబో చెప్పడం విశేషం. అంతే కాదు ఆన్ స్ర్కీన్ పై సారాను చూడాలని తెగ ఆరాటంగా ఉన్నానని కూడా అంటోంది కరీనా.

కేదార్ నాథ్

కేదార్ నాథ్

సారా కొత్త మూవీ కేదార్ నాథ్ కూడా వ‌చ్చే సంవ‌త్స‌రం రిలీజ్ అవ‌నుంది. ప్ర‌స్తుతానికి న్యూయార్క్ లో ఉన్న సారా... ఐఫా వేడుక‌ల్లో సైఫ్, సోద‌రుడితో సంద‌డి చేసింది. అభిషేక్ క‌పూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న కేదార్ నాథ్ మూవీలో హీరోగా సుషాంత్ సింగ్ రాజ్ పుత్ న‌టిస్తున్నాడు.

జీన్స్ లోనే న‌ట‌న ఉందీ

జీన్స్ లోనే న‌ట‌న ఉందీ

సారా జీన్స్ లోనే న‌ట‌న ఉంద‌నే విష‌యాన్ని గుర్తు చేసింది.. సైఫ్ టాప్ హీరోగా ఉన్న‌1991 లో హీరోయిన్ అమృత సింగ్ ను పెళ్లి చేసుకున్నాడు. 2004 లో అమృత తో డైవర్స్ తీసుకున్నాడు. వాళ్ల‌కు సారా(23), ఇబ్ర‌హీం (19) అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. త‌ర్వాత 2012 లో సైఫ్ అలీ ఖాన్.. క‌రీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల‌కు 2016 లో తైమూర్ జన్మించాడు. పిల్ల‌లు సైఫ్ తోనే ఉంటున్నారు.

English summary
"I truly believe that with her beauty and her talent, Sara Ali Khan is going to rock the industry for sure" Said Kareena Kapoor Khan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu