»   » నా కొడుకు పేరు నా ఇష్టం...ఆ పేరుకు అర్థం ఇది : సమాధానం చెప్పిన కరీనా

నా కొడుకు పేరు నా ఇష్టం...ఆ పేరుకు అర్థం ఇది : సమాధానం చెప్పిన కరీనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సీనియర్ భామ కరీనా కపూర్ డిసెంబర్ 20,2016న ముంబైలోని బ్రీచ్ క్యాండి హాస్పిటల్ లో బేబి బాయ్ కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకి కరీనా, సైఫ్ దంపతులు తైమూర్ అలీ ఖాన్ పటౌడీ అని నామకరణం చేసారు.. ఎన్నో రోజుల నుండి కరీనా అభిమానులు గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తోండగా, సైఫ్ తన అఫీషియల్ పేజ్ ద్వారా పండంటి మగ బిడ్డ జన్మించినట్టు తెలిపాడు. గత తొమ్మిది నెలల నుండి ఇటు మీడియా అటు అభిమానులు తమపై చూపించిన ప్రేమకు ఈ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. మేరీ క్రిస్ మరియు న్యూ ఇయర్ విషెస్ ని కూడా అందించారు.

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లు తమ కుమారుడికి తైమూర్ అలీ ఖాన్ పటౌడీ అనే పేరు పెట్టారు. దీనిపై విమర్శల వర్షం కురుస్తోంది. 14వ శతాబ్దంలో ఢిల్లీపైకి దండెత్తి వచ్చిన తైమూరు పేరు పెట్టడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై కరీనా కపూర్ బాబాయి, నటుడు రిషికపూర్ మండిపడ్డారు. బిడ్డకు తైమూర్ అనే పేరు పెడితే మీకు బాధ ఏమిటని ప్రశ్నించారు.

వారి పిల్లాడికి వారికి నచ్చిన పేరుకుంటారు... మీకు పుట్టిన పిల్లలకు వారు పేరు పెట్టలేదు కదా అని ప్రశ్నించారు. అలెగ్జాండర్, సికందర్ లు ఆధ్యాత్మిక గురువులేం కాదు... అయినా, ఎంతో మంది వారి పేర్లు పెట్టుకుంటున్నారని చెప్పారు. అనవసర కామెంట్లు చేయడం మానేసి... ఎవరి పనులు వారు చేసుకుంటే మంచిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kareena's Answer For People Trolling Her Sons Name

తైమూర్ అలీ ఖాన్ పటౌడీ పేరుపై కొందరు తమ పరిధిని దాటి వాదిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అసలు ఈ పేరు వెనుక ఉన్న కథ ఏంటంటే మంగోళ్ జాతి రాజు అయిన తైమూర్‌ 14వ శతాబ్ధంలో భారత దేశంపై దండయాత్ర చేసి ఢిల్లీలో పెను విధ్వంసం సృష్టించాడు. వందల మంది ప్రాణాలు బలిగొన్నాడు. అలాంటి వ్యక్తికి గల పేరుని కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ లు వారి కొడుకు ఎలా పెట్టుకున్నారనే విషయంపై పెద్ద రాద్దాంతం జరుగుతోంది. ఈ విషయమై రిషి కపూర్ నెట్ జనులను హెచ్చరించారు.

ఈ విమర్శలపై సైఫ్-కరీనాలు స్పందించారు. తైమూర్ అంటే టర్కీ భాషలో "ఇనుము లాంటి" అని అర్ధం. ధృఢమైన వ్యక్తి అనేక అర్ధం స్ఫురించేలానే తమ బిడ్డకు తైమూర్ గా పేరు పెట్టామని చెప్పారు. తమ బుల్లి నవాబు పేరు ఇంతటి వివాదానికి కారణమవుతుందని పాపం సైఫీనాలు భావించి ఉండరు. ఏదేమైనా ఈ విమర్శలను పట్టించుకునే తీరిక వారికి లేదు. చిన్నారి తైమూర్ వచ్చాడన్న ఆనందంతోనే వారు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు.

English summary
Actors Kareena Kapoor and Saif Ali Khan answer For People TROLLING Her Sons Name as Thaimur Alikhan Pataudee
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu