»   » క్రిష్ దర్శకత్వంలో కరీనా కపూర్ ఎంపిక

క్రిష్ దర్శకత్వంలో కరీనా కపూర్ ఎంపిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: గమ్యం' 'వేదం', 'కృష్ణమ్‌ వందే జగద్గురుమ్‌' తదితర సినిమాల్ని తెరకెక్కించిన తెలుగు దర్శకుడు క్రిష్‌ హిందీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ హీరో. దాంతో అక్షయ్ తో కరీనా కపూర్‌ జత కట్టబోతోంది. చిత్రం టైటిల్ 'గబ్బర్‌'. తమిళంలో వచ్చిన 'రమణ' (తెలుగులో ఠాగూర్‌) ఆధారంగా హిందీలో ఈ చిత్రం రూపొందబోతోంది. తెలుగులో జ్యోతిక చేసిన ప్లాష్ బ్యాక్ పాత్ర అది.

'ఇందులో అక్షయ్‌ కుమార్‌కి భార్యగా కరీనా కనిపించబోతోంది. 'కంబఖ్త్‌ ఇష్క్‌' తర్వాత వీరిద్దరూ కలిసి చేయబోతున్న సినిమా ఇదే. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూ చోటుంది. ఆ పాత్రకు అషిమా భల్లా పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తమిళంలో ఎ.ఆర్‌.మురుగదాస్‌ రూపొందించిన 'రమణ' కథ అవినీతిపై ఓ యుద్ధంలా సాగింది. ఈ కథను క్రిష్‌ బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకెళతారనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం పూర్వనిర్మాణ పనులు సాగుతున్నాయి. త్వరలోనే హీరోయిన్స్ ని, పూర్తి వివరాల్ని ప్రకటిస్తారు.

క్రిష్ మీడియాతో మాట్లాడుతూ ''భన్సాలీది దర్శకుడిగా ప్రత్యేక స్థానం. ఆయన నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించడం ఎంతో సంతోషంగా ఉంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా, వర్తమాన పరిస్థితులకు తగ్గట్టు కథ, కథనాల్లో మార్పులుచేర్పులుంటాయి''అన్నారు. త్వరలో షూటింగ్ మొదలవుతుంది.

ఇక ఆ మధ్య అక్షయ్ కుమార్ తెలుగులో హిట్టైన విక్రమార్కుడు చిత్రాన్ని..రౌడీ రాథోడ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఆ చిత్రాన్ని సైతం సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. వందకోట్లు దాటి రౌడీ రాథోడ్ కలెక్షన్స్ వర్షం కురిపించింది. అదే ఊపులో ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఇది తెలుగులో వచ్చిన 'ఠాగూర్‌' ఆధారంగా రూపొందబోతోంది. చిరంజీవి నటించిన 'ఠాగూర్‌'కి మాతృక తమిళ చిత్రం 'రమణ'. ఈ సినిమాపై గత కొంతకాలంగా హిందీ హీరోలు, దర్శకులు ఆసక్తి చూపించారు. భన్సాలీ హక్కులు పొందారు. ఈ చిత్రానికి ఓ దశలో ప్రభుదేవా దర్శకత్వం వహిస్తారనీ వార్తలొచ్చాయి. అవకాశం మాత్రం క్రిష్‌కి దక్కింది.

English summary
Kareena Kapoor has really become a busy bee these days. And this even forced her to loose out on an opportunity to work in very interesting projects. The leatest Buzz in the Btown is that the Kapoor girl will be seen romancing Khiladi Kumar, Akshay Kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu