»   » సుప్రీం కోర్టుకు హజరైంది,మాఫియా బెదిరింపులు

సుప్రీం కోర్టుకు హజరైంది,మాఫియా బెదిరింపులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్‌ మంగళవారంలో సుప్రీం కోర్టులో హాజరయ్యారు. భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తన విడాకుల కేసు విచారణను ముంబయి నుంచి దిల్లీకి మార్చాలని కోరింది.

అందుకు కారణంగ తనకు అండర్‌వరల్డ్‌ నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆమె నేడు కోర్టులో హాజరయ్యారు. జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ ఆర్‌కే అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఆమె పిటిషన్‌ను విచారించింది.

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ భర్త, అత్తల పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సంజయ్ కపూర్, అతని కుటుంబం తనను మానసికంగా వేధిస్తోందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Karisma Kapoor visits Supreme Court

గత కొద్ది రోజులుగా కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. తాజాగా కరిష్మా తన భర్త తరపు కుటుంబం తనని వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కరిష్మా ఫిర్యాదుతో సంజయ్ కపూర్‌ అతని కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ పెట్టుకున్న విడాకుల కేసు బాంద్రా కుటుంబ న్యాయస్థానంలో ఉంది.

మరోవైపు, కరిష్మాకు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం తెలియదని, డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకుందని సంజయ్ కపూర్ ఆరోపిస్తున్నాడు. తన పిల్లలను అడ్డం పెట్టుకొని డబ్బు కావాలని అడుగుతోందన్నారు. పిల్లలను తనకు అప్పగించాలని భర్త పిటిషన్ వేశాడు.

Karisma Kapoor visits Supreme Court

గతంలో విడాకులు, ఉపసంహరణ...

కరిష్మాకు సంజయ్ కపూర్‌తో 2003 లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అనంతరం 2010 నుంచి కరిష్మా ముంబైలోని తన పుట్టింట్లో ఉంటుంది. తర్వాత విడాకుల కోసం కోర్టు కెక్కారు. ఇద్దరి మధ్య కొన్ని విషాయాలు పరిష్కారం కాక పోవడంతో విడాకుల ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు.

గతంలో పలు వాయిదాల్లో వారిరువురు ఒక ఒప్పందానికి రాకపోవడంతో మళ్లీ కేసు వాయిదా మీద వాయిదా పడింది. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరూ ఒప్పందానికి రాకపోతే పిటీషన్‌ను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గతేడాది కరిష్మా విడాకుల పిటీషన్ ఉపసంహరించుకుంది.

English summary
Bollywood actress Karisma Kapoor on Tuesday visited the Supreme Court in a matrimonial dispute along with her estranged husband Sunjay Kapur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu