For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్ భర్త అంత చెడ్డవాడా? ఇదంతా విడాకుల సంతోషమే.. (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  ముంబై: ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన బ్యూటీ కరిష్మా కపూర్. కరిష్మా హీరోయిన్ గా నటించిన హీరో నెం.1, దిల్ తో పాగల్ హై, హమ్ సాత్ సాత్ హై, బివి నెంబర్ 1 లాంటి చిత్రాలు బాలీవుడ్లో భారీ విజయం సాధించాయి.

  బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించిన ఆమె కొన్నాళ్ల తర్వాత సంజయ్ కపూర్ అనే బిజినెస్‌మేన్‌ను పెళ్లాడింది. కొన్నాళ్ళ పాటు కరిష్మా సంసార జీవితం సాఫీగానే సాగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే కొన్నాళ్లకే కరిష్మా కాపురంలో కలతలు మొదలయ్యాయి. భర్త, అత్తింటి వారితో పడలేక పుట్టింటికి చేరిన కరిష్మా విడాకుల కోసం కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే.

  పలు కారణాలు, సెటిల్మెంట్ల విషయంలో విడాకుల కేసు ఏళ్ల పాటు కోర్టులో నలిగింది. ఈ మధ్య కోర్టు నుండి విడాకులు మంజూరయ్యాయి. విడాకుల తర్వాత కరిష్మా చాలా సంతోషంగా ఉంది. ఇటీవల హలిడే కోసం బుడాపెస్ట్ వెళ్లిన ఆమె గతంలో ఎన్నడూ లేనంత సంతోషంగా కనిపించింది. ఆమె పోస్టు చేసిన ఫోటోలు చూస్తే పట్టలేనంత సంతోషంగా ఉందని స్పష్టమవుతోంది.

  సంసార జీవితంలో కరిష్మా భర్త ద్వారా చాలా వేదన, నరకయాతన అనుభవించిందని, అతడితో తెగదెంపులు అయ్యాక ఇపుడు ఎంతో సంతోషంగా ఉందని ఆమె అభిమానులు అంటున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు....

  కరిష్మా కపూర్

  కరిష్మా కపూర్

  విడాకుల అనంతరం కరిష్మా కపూర్ ఫుల్ హ్యాపీగా ఉందనడానికి ఈ ఫోటోలే నిదర్శనం అంటున్నారు ఫ్యాన్స్.

  బుడాపెస్ట్

  బుడాపెస్ట్

  కరిష్మా కపూర్ ప్రస్తుతం బుడాపెస్ట్ లో హాలిడే గడుపుతోంది.

  భర్తతో నరకం?

  భర్తతో నరకం?

  భర్త సంజయ్ కపూర్ వల్ల సంసార జీవితంలో కరిష్మా కపూర్ చాలా కష్టాలు అనుభవించిందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

  విడిపోయాక కూడా రచ్చ చేసిన భర్త

  విడిపోయాక కూడా రచ్చ చేసిన భర్త

  ఇటీవల సంజయ్ కపూర్ బ్రిటీష్ క్యాపిటల్ లోని ఓ రెస్టారెంట్ లో తన స్నేహితులతో కలిసి ఉన్నారు. అక్కడకి అతడు ఉన్నాడనే విషయం తెలియని కరిష్మా కపూర్ వచ్చింది. ఆమెతో పాటు ఆమె స్నేహితుడు సందీప్ తోషివాల్ కూడా ఉన్నారు. వీరిద్దరని చూసిన సంజయ్ కపూర్ నోటి కి వచ్చనట్లు అరుస్తూ , పెద్దగా చప్పట్లు కొడుతూ రచ్చ చేసాడు.

  న్యూసెన్స్

  న్యూసెన్స్

  అంతటితో ఆగని సంజయ్ ఆమెను అవమానించే మాటలు మాట్లాడుతూ సీన్ క్రియోట్ చేసాడు. దాంతో ఆమెకు ఏం చేయాలో పాలు పోలేదు. రెస్టారెంట్ లో అందరి దృష్టి వీరిపైనే పడింది. సంజయ్ స్నేహితులు గట్టిగా పట్టుకుని ఆపేదాకా న్యూసెన్స్ క్రియేట్ చేసాడు.

  విడిపోయాక కూడా, చీప్ గా..

  విడిపోయాక కూడా, చీప్ గా..

  విడిపోయాక..ఎవరు ఎవరితో ఉంటే ఏమిటి, అసలు ఆమె ఎవరితో అక్కడికి వచ్చింది...వంటి విషయాలు పరిగణనలోకి తీసుకోకుండా సంజయ్ కపూర్ క్రియేట్ చేసిన సీన్ ని ముంబై మిర్రర్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. సంజయ్ కపూర్ ప్రవర్తన చాలా చీప్ గా ఉందని అంతా విమర్శించారు.

  కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ కూడా..

  కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ కూడా..

  సంజయ్ మంచి వాడు కాదు, అతడో ధర్డ్ క్లాస్ మనిషి, అతనితో వివాహం నాకు ఎప్పుడూ ఇష్టం లేదు. భార్యని ఎప్పుడూ సరిగా చూడలేదు. వేరే ఆమెతో ఎప్పుడు నుంచో ఉంటున్నాడు. డిల్లీ మొత్తం ఈ విషయం తెలుసు. దీని గురించి ఎక్కువ చెప్పటం అనవసరం అన్నారు.

  2003లో వివాహం

  2003లో వివాహం

  2003లో వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట మధ్య కొద్ది సంవత్సరాల తరువాత విభేదాలు మొదలయ్యాయి.

  2010లో..

  2010లో..

  కరిష్మా 2010లో సంజయ్‌కు దూరమై ముంబయికి మకాం మార్చారు. 2014లో విడాకులు తీసుకోవాలని పరస్పరం నిర్ణయించుకుని న్యాయస్థానానికి దరఖాస్తు చేసి తీసుకున్నారు.

  ఐదేళ్ల తర్వాత

  ఐదేళ్ల తర్వాత

  కరిష్మ, సంజయ్ కపూర్ విడిపోయిన ఐదేళ్ల తర్వాత విడాకులు మంజూరయ్యాయి.

  English summary
  Going by the reports and allegations made by Karisma Kapoor for her ex-husband Sunjay Kapoor, one can understand that the actress has gone through a lot! Finally, Karisma is out of her troubled marriage and post divorce, here's what she is doing! The Raja Hindustani actress was seen holidaying in Budapest like here ain't any tomorrow and we are glad to see her so happy and enjoying her life on her own terms and conditions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X