»   » పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..! ... కర్ణాటక కబాలీ వివాదం ఏమైందీ..!!?

పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..! ... కర్ణాటక కబాలీ వివాదం ఏమైందీ..!!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తాజా విడుద‌లైన 'క‌బాలి' సినిమా ద్వారా ప్ర‌పంచానికి మ‌రోసారి వెల్ల‌డైంది. మ‌న‌దేశంలోనే విదేశాల్లోనూ ర‌జ‌నీకి భారీ సంఖ్య‌లో అభిమానులున్నారు. త‌మిళ‌నాడు అయితే ఇక చెప్ప‌నే అక్క‌ర్లేదు .అక్క‌డ ఆయ‌న్ను న‌డిచే దేవుడిలా కొలుస్తారు. అయితే ర‌జ‌నీ సొంత రాష్ట్రం కర్ణాట‌కలో మాత్రం ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతుండ‌టం విశేషం. ఆయ‌న సినిమాలు విడుద‌ల చేయొద్దంటూ నిర‌స‌న‌లు కూడా వెల్లువెత్త‌డం షాకింగ్ గా మారింది.

రెండు రోజుల పాటుఅక్కడ కబాలి పోస్టర్లను, రజనీకాంత్ ఫోటోలను దగ్ధం చేసే పనిలో వున్నారు అక్కడి జనాలు. ఇందుకు గల కారణం కావేరి జల వివాదం విషయంలో రజనీకాంత్ కర్ణాటకకు కాకుండా తమిళనాడుకు మద్ధతునిచ్చాడనే ఉద్ధేశంతో కర్ణాటక జనాలు ఆగ్రహం వ్యక్తం చేసారు.. కాస్త సద్దు మనగ గానే "కబాలీ టికెట్ల" కోసం వెళ్ళి క్యూ లో నిలబడ్డారు.అసలు ఈ ఘటనల వెనుక ఉన్న ఉద్దేశమేమిటో గానీ కబాలీ మీద మాత్రం కర్ణాటక ప్రేక్షకులకు ఆగ్రహం కాస్త తగ్గినట్టే ఉంది... నెమ్మదిగా థియేటర్లకు బయల్దేరుతున్నారు... కర్ణాటకీయన్లు...
అస‌లు స్టోరీలోకి వెళ్తే


పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..

పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ సొంత రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క లో ఆయ‌న‌కు ఇప్పుడు తీవ్ర వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన చిత్రం క‌బాలి పోస్ట‌ర్ల‌ను అక్క‌డి ర‌జ‌నీ అభిమానులు, క‌న్న‌డ వేదిక స‌భ్యులు చించేసారు. కొన్ని చోట్ల త‌గ‌లబెట్టారు కూడా.ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కబాలికి సౌత్ లో ఉన్న కర్ణాటకలో తీవ్ర వ్యతిరేఖత ఏర్పడింది.


పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

నిజానికి పుట్టుకతో మరాఠీ అయిన రజినీ సొంత రాష్ట్రం మాత్రం క‌ర్ణాటక అన్న విష‌యం తెలిసిందే. బెంగ‌ళూరు లో కండ‌క్ట‌ర్ ప‌నిచేస్తూ ర‌జ‌నీ సినిమా అవ‌కాశాల కోసం చెన్నై వ‌చ్చి సూపర్ స్టార్ గా మారి ఇక్క‌డే స్థిర‌ప‌డిపోయారు. అయితే క‌న్న‌డిగులు గ‌ర్వ‌ప‌డాలి కానీ ర‌జ‌నీకాంత్ ను వ్య‌తిరేకించ‌డం ఎందుకు అంటారా?


పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క మ‌ధ్య కావేరీ న‌దికి సంబంధించిన జ‌ల వివాదాలు కొన్ని ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఉన్నాయి. ఈ వివాదాలు ఆయా రాష్ట్రాల్లో సెంటిమెంటు కూడా. అందుకే ఈ జ‌ల వివాదాల‌పై మాట్టాడేందుకు త‌లలు పండిన రాజకీయ నేత‌లు కూడా ఎంతో ఆచి తూచి మాట్లాడుతుంటారు.


పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ.. త‌మిళ‌నాడుకు మ‌ద్ద‌తిచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామం క‌ర్ణాట‌క వాసుల‌కు ఆగ్రహం తెప్పించింది.. ఆఖరికి రజినీ అభిమానులు కూదా ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు.


పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

ఈ క్ర‌మంలో ఉక్రోషాన్ని ఆపుకోలేని ప‌లువురు రాజ‌కీయ పార్టీల కార్యకర్తలు, కన్నడ వేదిక నిర్వాహకులు ర‌జనీకి వ్య‌తిరేకంగా ఏదో ఒక‌టి చేయాల‌ని డిసైడ్ అయి పోయారు. ఈ క్ర‌మంలో క‌బాలి పోస్ట‌ర్ల‌ను ఎక్క‌డివ‌క్క‌డ చించేయ‌డంతో పాటు. ర‌జ‌నీపై విరుచుకుప‌డ్డారు.


పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

ఇక చిన్న నిర్మాతలూ, డైరెక్టర్లూ సరేసరీ వాళ్ళ ఉక్రోషం వాళ్ళకూ ఉంది. కబాలి చిత్రాన్ని కర్ణాటకలోని 300 థియేటర్లకు పైగా విడుదల చేయాడాన్ని తప్పుపడుతున్నారు. రజనీకాంత్ కర్ణాకటకు చెందిన వ్యక్తి అయినా తమిళ పక్షపాతి అని వారు దుయ్యబడుతున్నారు.


పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

అయితే దీని వెనక జలవివాదమే కారణమా అన్న విశయం లోనూ అనుమానాలున్నాయి... కబాలి చిత్రాన్ని కర్ణాటకలో భారీ స్థాయిలో దాదాపు 300 థియేటర్లకు పైగా విడుదల చేసారు. దీనివల్ల కన్నడ సినిమాలు విడుదలకు నోచుకోకుండా, సరైన కలెక్షన్లు దొరకక బాధింపులకు గురవుతున్నాయని కన్నడ వేదిక నిర్వాహకుడు పటాళ్ నాగరాజ్ అనటం కేవలం జల వివాదమే కారణం కాదేమో అనే విధంగా కూడా ఉంది.


పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

ఏదేమైనా కబాలి సినిమా టాక్ ఎలా వున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా మాత్రం కలెక్షన్ల మోత మోగిస్తుంది. కథ, కథనం, డివైడ్ టాక్.. ఇవన్నీ పక్కనపెడితే ఈ సినిమా కేవలం రజనీకాంత్ స్టైల్, యాక్టింగ్ కోసమైనా చూడవచ్చునని, అభిమానులు ఎంజాయ్ చేసే విధంగా వుందని చెప్పుకోవచ్చు.


పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

పోస్టర్లు తగలబెట్టీ..! రజినీని తిట్టీ..!

అసలు ఈ ఘటనల వెనుక ఉన్న ఉద్దేశమేమిటో గానీ కబాలీ మీద మాత్రం కర్ణాటక ప్రేక్షకులకు ఆగ్రహం కాస్త తగ్గినట్టే ఉంది... నెమ్మదిగా థియేటర్లకు బయల్దేరుతున్నారు... కర్ణాటకీయన్లు...


English summary
​Kannada activist Vatal Nagaraj thinks the Rajinikanth-starrer does not deserve that sort hype as it is a non-Kannada film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu