»   » ఆ మూవీ స్క్రిప్ట్ తనిఖీ చేయమంటూ డిమాండ్....వివాదం మరింత తీవ్రం అవనుందా??

ఆ మూవీ స్క్రిప్ట్ తనిఖీ చేయమంటూ డిమాండ్....వివాదం మరింత తీవ్రం అవనుందా??

Posted By:
Subscribe to Filmibeat Telugu
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న పద్మావతి చిత్రం వివాదాల లో మరింతగా కూరుకు పోతోంది. .కొద్దిరోజుల క్రితమే పద్మావతి చిత్రంలో చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై కర్ని సేన దాడికి కూడా దిగిన సంగతి తెల్సిందే.

బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న పద్మావతి మూవీ షూటింగ్‌కి వ్యతిరేకంగా కర్నిసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పద్మావతి చిత్రంలో చారిత్రాత్మక అంశాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించిన కర్నిసేన కార్యకర్తలు..జైగఢ్ కోట వద్ద జరుగుతున్న షూటింగ్‌ను అడ్డుకున్నారు. ఆ వివాదం సద్దు మణగక ముందే మరో దిమడ్ చేస్తోంది కర్ణి సేన.

 రాణిని హీనంగా చూపిస్తున్నారని:

రాణిని హీనంగా చూపిస్తున్నారని:


కొద్దిరోజుల క్రితమే పద్మావతి సినిమా యూనిట్ పై రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.సంజయ్‌లీలా బన్సాలీ ని చెంపదెబ్బలు కొట్టడంతో పాటు పిడిగుద్దులు కురిపించారు. ఘటన జైగఢ్ కోట వద్ద జరిగింది. దాడితో సినిమా టీం మొత్తం షాక్‌కు గురైంది. సినిమాలో రాజ్‌పుత్ రాణిని హీనంగా చూపిస్తున్నారని రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఘటన పై బాలీవుడ్ నుంచి కూదా పెద్ద స్థాయిలోనే నిరసన చెలరేగింది.

 రాజ్‌పుత్ సేన:

రాజ్‌పుత్ సేన:


ఒక దర్శకున్ని అంత పాశవికంగా కొట్టటం పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు తప్పుపట్టారు. ట్విటర్ మొత్తం సినీ ప్రముఖుల ట్వీట్లతో నిండిపోయింది. సంజయ్ లీలాబన్సాలీకి మద్దతుగా తామంతా ఉన్నామని బాలివుడ్ మొత్తం ఏక కంఠం తో సంజయ్ కి బరోసా నిచ్చింది. అయితే ఇంత జరిగిన తర్వాత కూడ దాడికి పాల్పడ్డ రాజ్‌పుత్ సేన మాత్రం తమ చర్యలు సరైనవేనంటూ సమర్థించుకుంది.

 ప్రముఖ చరిత్రకారుడు:

ప్రముఖ చరిత్రకారుడు:


అయితే ఇక్కడొక పెద్ద ట్విస్టేమిటంటే ప్రముఖ చరిత్రకారుడు ఎస్‌.ఇర్ఫాన్‌ హబీబ్‌ అసలు చరిత్రలో రాణి పద్మావతి పేరుతో ఏ రాణీ లేదని చెబుతున్నాడు.హబీబ్ మాట్లాడుతూ...1303 కాలంలో చిత్తోడ్‌ కోటలో ఖిల్జి.. తాను అద్దంలో చూసి ఇష్టపడిన రాణి పద్మావతిని వశపరుచుకోవడానికి ఆమె భర్త రాజా రావల్‌రతన్‌ సింగ్‌ కోటను స్వాధీనం చేసుకుంటాడు.

మొఘల్‌ ఎ ఆజం'లో :

మొఘల్‌ ఎ ఆజం'లో :

అయితే రాణి పద్మావతి అసలు చరిత్రలోనే లేదని, 1540లో మాలిక్‌ మహమ్మద్‌ జాయసి అనే కవి'పద్మావత్‌' అన్న కావ్యంలో పద్మావతి అనే పాత్రని కల్పించారని హబీబ్‌ చెప్తున్నారు. పద్మావతే కాదు 'మొఘల్‌ ఎ ఆజం'లో చూపించిన అనార్కలి అనే యువతి కూడా లేదని అది కూడా కల్పిత పాత్రేనని ఆయన ఆరోపించారు. భన్సాలీపై దాడి జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారడంతో హబీబ్‌ ట్విటర్‌ ద్వారా పద్మావతి చరిత్రకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

 అల్లావుద్దీన్‌ ఖిల్జీ:

అల్లావుద్దీన్‌ ఖిల్జీ:

అయితే భన్సాలీ కూడా కర్ణి సేన కి తమ సినిమాలో .. రాణీ పద్మావతి, అల్లావుద్దీన్‌ ఖిల్జీ మధ్య ఒక్కటంటే ఒక్క సీన్‌ కూడా లేదని, వారిద్దరూ పాటలు పాడుకోవడంగానీ, డ్రీమ్స్‌లో రొమాన్స్‌ చేసే స్కోప్‌గానీ లేవంటే లేవని క్లారిటీ ఇచ్చాడు. అయితే భన్సాలీ వివరణ ఇచ్చినా కర్ణి సేన ఊరుకోలేదు. చరిత్రకు సంబంధించిన చిత్రాలను తీసేటప్పుడు ముందుగా స్క్రిప్ట్ స్క్రూటినీకి ఒక నిపుణుల కమిటీ ఉండాలని డిమాండ్ చేసింది.

 ప్రీ స్క్రీనింగ్ బోర్డ్:

ప్రీ స్క్రీనింగ్ బోర్డ్:


ఈ స్క్రూటినీకి ఒక నిపుణుల కమిటీ వేయాలని ఆ ప్రీ స్క్రీనింగ్ బోర్డ్ లో చరిత్రకారులు, జర్నలిస్టులు ఉండాలని కూడా డిమాండ్ చేసింది. కమిటీలో ఒక రిటైర్డ్ జడ్జి, ఇద్దరు జర్నలిస్టులు, ఆయా రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చరిత్రకారులు ఉండాలని కూడా కర్నీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకు ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా ఇస్తామని కల్వీ మీడియాకు చెప్పాడు.

English summary
Karni Sena's founder Lokendra Singh Kalvi has demanded the setting up of a pre-screening board to examine films with historical themes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu