»   » నిజమే...హీరో కార్తీనే, కాస్త వెరైటిగా ట్రై చేసాడంతే...(ఫొటో)

నిజమే...హీరో కార్తీనే, కాస్త వెరైటిగా ట్రై చేసాడంతే...(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఊపిరి సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరితం బాగా కనెక్ట్ అయ్యాడు హీరో కార్తి. దాంతో ఆయన తాజా చిత్రం కాశ్మోరాని సైతం భారీ ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. గోకుల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కాశ్మోరా' చిత్రం ఫస్ట్ లుక్ ని తెలుగులో రిలీజ్ చేసారు. ఆ ఫస్ట్ లుక్ లో కార్తీ పూర్తిగా గుండు చేయించుకుని, ఓ సైనికాధిగారిగా, యుద్ద రంగంలో ఉంటూ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.


దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో కార్తీని చూసిన వారంతా అతడి మేక్ ఓవర్‌కు ఫిదా అయిపోతూ తెగ మెచ్చేసుకుంటున్నారు.

పీవీపీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కార్తీ సరసన నయన తార, శ్రీ దివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాష్మోరా ఫస్ట్‌లుక్ విడుదల దగ్గరనుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది.

Karthi as Kaashmora - first look

ఇక ఈ సినిమాలో మూడు పాత్రలు పోషిస్తున్నాడు కార్తీ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దాదాపు పదిహేను నిమిషాల పాటు 3డి ఫేస్ స్కాన్ చేసి చిత్రీకరించనున్నారు. గతంలో రజనీకాంత్ 'కొచ్చాడియాన్' సినిమాకు ఈ టెక్నాలజీ ఉపయోగించారు. ప్రస్తుతం కార్తీ ఫేస్ వరకు మాత్రం స్కాన్ చేసి మూవీలో వాడుకుంటున్నారు.

చెన్నైలో పూనమలై రోడ్ దగ్గర వేసిన భారీ సెట్ లో కాశ్మోరా సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను కార్తీ, నయనతార, శ్రీ విద్య లపై తీసారు. విశేషమేంటంటే ఈ సినిమాకోసం పదహారు సెట్స్ వేశారట. ఈ నెలాఖరుకు కాశ్మోరా షూటింగ్ పూర్తి అవుతుంది.

ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ని 'బాహబలి' సినిమాకి పనిచేసిన మకుట సంస్థ సమకూరుస్తున్నది. ఈ సినిమాకి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Karthi now coming with another interesting film titled 'Kaashmora'. Directed by Tamil director Gokul, the movie has music by Santosh Narayan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu