For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'బాహుబలి' డైనోసార్, మేం చిన్న కుక్క పిల్లలం: హీరో కార్తి

  By Srikanya
  |

  చెన్నై: 'బాహుబలి 200 కోట్లతో ఓ సినిమా..అది అంత రేంజిలో డైనోసార్ లాగ ఉంది. మనం ఏమో స్మాల్ కుక్కలా,పప్పిలా ఉన్నాం. ఏం చేయబోతున్నాం ఇది, అంత బడ్జెట్ లేదు, కానీ చాలా బాగా తీసాం. రాజుల కథ అనగానే అందరూ బాహుబలిలాగే ఎక్సపెక్ట్ చేస్తారు. బిగ్ ఛాలెంజ్ మాకు..'అంటూ చెప్పుకొచ్చారు హీరో కార్తి.

  కార్తీ హీరోగా తెలుగు,తమిళ భాషల్లో 'కాష్మరా' టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో కార్తీ మూడు విభిన్న పాత్రల్లో నటించారని చెప్పారు. అదే విధంగా నయనతార, శ్రీదివ్య చాలా బాగా నటించారని తెలిపారు.

  ఈ చిత్రాన్ని డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్.ప్రభు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన కార్తి డిఫరెంట్ లుక్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియోని విడుదల చేసారు. ఈ ఆడియో చాలా సరదాగా గడిచింది. ఆడియో ఫంక్షన్ కు సంభందించిన ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

  నయనతార డుమ్మా

  నయనతార డుమ్మా

  సంతోష్‌నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించారు. ఈ ఆడియో పంక్షన్ ని నిర్మాతలు చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే షరామామూలుగానే నయనతార పాల్గొనలేదన్నది గమనార్హం.

  పదే పదే బాహుబలిని

  పదే పదే బాహుబలిని

  ఈ ఆడియో ఫంక్షన్ లో చిత్ర దర్శకుడు గోకుల్, హీరో కార్తీ, నిర్మాతల్లో ఒకరైన ఎస్‌ఆర్.ప్రభు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిని, బాహుబలి చిత్రాన్ని పదే పదే ప్రస్తావించడం విశేషం. అందరూ బాహుబలితో తమ చిత్రాన్ని పోల్చి చూస్తారన్నట్లు , తాము ఛాలెంజ్ గా తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

  రాజమౌళి బెంచ్ మార్క్ పెట్టారు

  రాజమౌళి బెంచ్ మార్క్ పెట్టారు

  దర్శకుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో బెంచ్ మార్క్ పెట్టారని కాష్మోరా చిత్ర దర్శకుడు గోకుల్ వ్యాఖ్యానించటం విశేషం. ఇంతకు ముందు రౌద్రం, ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజా చిత్రం కాష్మోరా.

  హిస్టారికల్ సీన్స్ తో కూడిన

  హిస్టారికల్ సీన్స్ తో కూడిన

  దర్శకుడు మాట్లాడుతూ హిస్టారికల్ అంశాలతో కూడిన పిరియడ్ కథా చిత్రం కాష్మోరా అని తెలిపారు. ఇందులో హిస్టారికల్ సన్నివేశాలు అవసరం అయ్యాయన్నారు. ఈ సన్నివేశాలను రూపొందించడనాకి సిద్ధం అయినప్పుడు బాహుబలి చిత్రం గుర్తు కొచ్చిందన్నారు.

  బాహుబలిలో 30 శాతం

  బాహుబలిలో 30 శాతం

  ఆ చిత్రంలో గ్రాఫిక్ సన్నివేశాల విషయంలో దర్శకుడు రాజమౌళి బెంచ్‌మార్క్ పెట్టారన్నారు. తాము అంతగా కాకపోయినా కనీసం 30 శాతం అయినా చేయాలని భావించామని దర్శకుడు తెలిపారు.

  కెరీర్ ముఖ్యమైనది

  కెరీర్ ముఖ్యమైనది

  చిత్ర హీరో కార్తీ మాట్లాడుతూ కాష్మోరా తన కేరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రం అని పేర్కొన్నారు. దర్శకుడు గోకుల్ ఈ చిత్రంలోని ఒక పాత్ర గురించి చెప్పినప్పుడే అందులో నటించగలనా అని భయమేసిందన్నారు. కాష్మో రా లాంటి చిత్రం చేయడానికి నిర్మాతలకు సినిమా ప్యాషన్ ఉండాలన్నారు. రెండేళ్ల పాటు చిత్ర యూనిట్ కఠిన శ్రమ కాష్మోరా అని పేర్కొన్నారు.

  బాహుబలితో పోల్చుకుని

  బాహుబలితో పోల్చుకుని

  చిత్రంలో హిస్టారికల్ సన్నివేశాలు చోటు చేసుకోవడంతో బాహుబలి చిత్రంలా శ్రమించాల్సివచ్చిందన్నారు. చిత్రాన్ని తమిళం,తెలుగు భాషలలో దీపావళికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

  శ్రీదివ్య ఏమందంటే..

  శ్రీదివ్య ఏమందంటే..

  చాలా కాలంగా కోరుకుంటున్న మోడరన్ పాత్రను పోషించే అవకాశం కాష్మోరాలో కలిగిందని శ్రీదివ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన పాత్ర తనకు మంచి పేరు తెస్తుందని చెప్పుకొచ్చారు.

   ప్రారంభమై మూడేళ్లు

  ప్రారంభమై మూడేళ్లు

  ‘రౌద్రం', ‘ఇదర్కుతానే ఆసైపట్టాయ్‌ బాలకుమారా' వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన గోకుల్‌ దర్శకత్వంలో కార్తి, నయనతార, శ్రీదివ్య ముఖ్యతారాగణంగా రూపొందిన చిత్రం ‘కాష్మోరా'. ఫ్యాంటసీగా రూపొందిన ఈ చిత్రం పనులు ప్రారంభమై దాదాపు మూడేళ్లయ్యాయి.

  విజువల్ ఎఫెక్ట్స్ దే

  విజువల్ ఎఫెక్ట్స్ దే

  చిత్రంలో 97 నిమిషాల విజువల్‌ ఎఫెక్ట్స్‌ దృశ్యాలు ఉన్నాయి. కార్తికి సంబంధించిన సన్నివేశాలను 40 రోజులకు పైబడి చిత్రీకరించారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగించుకుని నిర్మాణానంతర పనుల్లో ఈ చిత్రం ఉంది.

  బాహుబలి చూసి ఈర్ష్య

  బాహుబలి చూసి ఈర్ష్య

  ఈ సందర్భంగా నటుడు కార్తి మాట్లాడుతూ తన సినీ కెరీర్ సంబంధించి ‘కాష్మోరా' అతి కీలకమన్నారు. ‘ఇదర్కుతానే ఆసైపట్టాయ్‌ బాలకుమారా' చిత్రం చూసిన తర్వాత దర్శకుడు గోకుల్‌ చిత్రంలో నటించాలని ఆకాంక్షించానని తెలిపారు. తనకు దెయ్యం కథలంటే నచ్చుతాయనేమో అలాంటి కథతోనే గోకుల్‌ తన దగ్గరకు వచ్చారని పేర్కొన్నారు. ‘కాష్మోరా' చాలా జాలీగా సాగే చిత్రమని, అదే సమయం పెనుసవాళ్లతో కూడుకున్నదని తెలిపారు. ‘బాహుబలి' వంటి చిత్రాలను చూసేటప్పుడు మనకు ఇలాంటి చిత్రాల్లో నటించే అవకాశం లభించలేదనే ఈర్ష్య కలుగుతుందని, ‘కాష్మోరా' కొంత ఆ లోటు తీరుస్తుందన్నారు.

  అప్పటి చిత్రాలు చూసి

  అప్పటి చిత్రాలు చూసి

  పెద్ద బడ్జెట్‌ చిత్రమైనా కొన్ని విజువల్‌ ఎఫెక్ట్స్‌ దృశ్యాల కోసం ట్రాలీని ఉపయోగించి చిత్రీకరించారని తెలిపారు. తన తండ్రి (సీనియర్‌ నటుడు శివకుమార్‌) చిత్రాలు చూస్తే పలు చిత్రాల్లో కళాత్మక దృశ్యాలు అద్భుతంగా ఉంటాయని, అప్పట్లో పనిచేసిన పలువురు ఆర్ట్‌ డైరెక్టర్లు ప్రస్తుతం సినీరంగంలో లేరని పేర్కొన్నారు.

  అప్పటివాళ్లను వెతికి పట్టుకున్నాం

  అప్పటివాళ్లను వెతికి పట్టుకున్నాం

  ‘కాష్మోరా'లో ఏనుగులు, గుర్రాలు వంటి పలు జంతువులను చూపించాల్సి ఉంటుందని, వాటిని కృత్రిమంగా తయారు చేసేందుకు ఆ కాలంలో పని చేసిన 80-85 ఏళ్ల ఆర్ట్‌ డైరెక్టర్లను వెతికి పట్టుకుని వారితో పని చేయించామని తెలిపారు. వారితో కలిసి పని చేయడం గర్వకారణంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రజాదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  తొలిసారి శ్రీదివ్యతో

  తొలిసారి శ్రీదివ్యతో

  చిన్నకథగా ఉన్నప్పటికీ దానిని బ్రహ్మాండ స్థాయికి తీసుకెళ్లారని తెలిపారు. నయనతార, శ్రీదివ్యలతో కలిసి తొలిసారి నటించానని, రత్నమహాదేవిగా నయనతార నటిస్తున్నారని పేర్కొన్నారు. ‘పైయా' చిత్రంలోనే నయనతారతో కలిసి పని చేయాల్సిందని, అయితే ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని తెలిపారు. శ్రీదివ్య తొలిసారిగా హాస్య, ఆధునిక పాత్రలో నటిస్తున్నారని, ప్రేమకథా సన్నివేశాలు లేని చిత్రమని పేర్కొన్నారు.

  ట్రైలర్ ఇదిగో ఇక్కడ

  సైనికాధికారిగా, గూఢచారిగా, నేటితరం యువకుడిగా మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో నయనతార, శ్రీ దివ్య హీరోయిన్లుగా చేస్తున్నారు.

  English summary
  When speaking about the Kashmora project Karthi compared Baahubali with dinosaur and Kashmora with small puppets. In audio launch, he also added that Baahubali is like a grandfather and we are learned many things from the movie. The makers are planning to release the movie on October 28, 2016. Karthi role in Kashmora will definitely attract the audience.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X