»   » తెలుగు పాట పాడిన హీరో కార్తి

తెలుగు పాట పాడిన హీరో కార్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : హీరోలు తెరపై డైలాగులు, అడుగులేయటం మాత్రమేకాదు మైకులందుకుని పాటలు కూడా పాడేస్తున్నారు. రీసెంట్ గా తెలుగులో పవన్ కళ్యాణ్, తమిళంలో ధనుష్‌, శింబు, విజయ్‌, విక్రమ్‌.. ఇలా చాలామంది పాటలందుకుని ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పుడు ఆ వరుసలో నటుడు కార్తి కూడా చేరాడు. స్టూడియో గ్రీన్‌ ప్రొడక్షన్‌లో కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రం 'బిరియాని' చిత్రం కోసం కార్తీ ఓ సారి తెలుగు,తమిళ భాషల్లో సింగేసాడు.

వెంకట్‌ప్రభు దర్శకుత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అన్నివర్గాల ప్రేక్షకులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా బాణీలు సమకూర్చుతున్న ఈ చిత్రంలో ఓ పాట పాడాడు కార్తి. తమిళంలో ఇటీవలే దీనిని రికార్డింగ్‌ చేశారు. ఇదే గీతాన్ని తెలుగులోనూ ఆలపించాడు. మరి ఈ పాట ప్రేక్షకుల చెంతకు ఏమేర వెళ్తుందో చూద్దాం.

తన సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన సినిమా 'బిర్యాని'. ఈ సినిమాని ముందుగా సెప్టెంబర్ 6న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదలని సంక్రాంతికి వాయిదా వేశారు. హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కార్తీ ప్లే బాయ్ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

ఈ సినిమా ఆడియో తమిళంలో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంచి. ప్రేంజీ అమరెన్, మండి తఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెప్తున్నారు. మాములుగా బిర్యాని తర్వాత రావాల్సిన కార్తీ 'ఆల్ ఇన్ ఆల్ అజుగు రాజా' సినిమా మాత్రం కాస్త ముందుగా దీపావళికే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కార్తీ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

హన్సిక మాట్లాడుతూ.... ''నా అదృష్టం కొద్దీ రానున్న అన్నీ సినిమాల్లోనూ మంచి పాత్రలే చేస్తున్నాను. నాకు జర్నలిస్ట్ వృత్తి అంటే చాలా గౌరవం. ఒక్క సినిమాలోనైనా జర్నలిస్ట్‌గా కనిపించాలనేది నా ఆశ. త్వరలో ఆ కోరిక కూడా తీరబోతోంది. కార్తీ 'బిర్యాని' చిత్రంలో జర్నలిస్ట్‌గా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే 'ది బెస్ట్' అనదగ్గ కేరక్టర్ అది'' అంది. ఇక ఈ చిత్రంపై తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ బాగానే మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. తెలుగులో కార్తీకి ఉన్న బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వారికి నచ్చే ఎలిమెంట్స్ కలిపి మరీ నిర్మించారని చెప్తున్నారు. శకుని,బ్యాడ్ బోయ్ చిత్రాలు నిరాశ పరిచిన నేపధ్యంలో ఈ చిత్రం కార్తీకి ఊపునిస్తుందని భావిస్తున్నారు.

English summary
Karthi has sung a song for the first time in Ke.Gnanavelraja’s studio green “Briyani” with Premji. Kavignar Valee’s lyric goes ” missis sippy… missis sippy… nadhi idhu…”. This is Yuvan’s 100th movie & is directed by Venkatprabhu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu