For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మూడురోజులైనా ఇంకా చూస్తూనే ఉన్నారు: మనదగ్గర కార్తీకి ఇంత క్రేజా

  |

  తాము చేయబోయే పాత్రలకు 100 శాతం న్యాయం చేయటానికి బాగానే కష్టపడుతున్నారు ఈ తరం హీరోలు. షూటింగ్ ప్రారంభమవ్వడానికి ముందే అసలు ఆ పాత్ర ఎలా ఉండబోతుందో తెలుసుకొని దానిమీద శిక్షణ తీసుకొనీ, అవసరం అనుకుంటే పర్సనల్ గా రీసెర్చ్ చేసుకొని మరీ ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేయాలనుకునే దోరణి ఈ మధ్య మన హీరోల్లో పెరిగి పోయింది. గతం లో లా ఏ పాత్రనీ లైట్ తీసుకోవటం, లేదంటే దర్శకుడు ఇచ్చే ఇంపుట్స్ మాత్రమే తీసుకొని అప్పటికప్పుడు ఆ సీన్ పూర్తి చేయటం కాకుండా. పాత్రలో ఒదిగిపోవటానికి ఎంత కష్టపడాలో అంతా పడుతూనే ఉన్నారు. తెరపై వాటికి వందశాతం న్యాయం చేయాలని తపిస్తున్నారు.

  ధీరన్ అధిగారం ఒండ్రు

  ధీరన్ అధిగారం ఒండ్రు

  తాజాగా ఓ తమిళ చిత్రం కోసం హీరో కార్తి ప్రత్యేకంగా పోలీస్ శిక్షణ తీసుకుంటున్నాడు. తమిళ భాషల్లో కార్తీకి మంచి క్రేజ్ వుంది. అందువలన ఆయన తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. కార్తి తాజా చిత్రంగా తమిళంలో 'ధీరన్ అధిగారం ఒండ్రు' అనే సినిమా తెరకెక్కుతోంది.

  పోలీసులకు ఇచ్చే కఠోర శిక్షణ

  పోలీసులకు ఇచ్చే కఠోర శిక్షణ

  'ది పవర్ ఆఫ్ పోలీస్' అనేది ట్యాగ్ లైన్. ఈ పాత్ర కోసం పోలీసులకు ఇచ్చే కఠోర శిక్షణను కార్తి తీసుకుంటున్నట్లు సమాచారం. బాడీలాంగ్వేజ్‌లో పూర్తిగా మార్పులు చేసుకున్నట్లు తెలిసింది. సినిమాలో వినూత్న పంథాలో ఆయన పాత్ర సాగతుందని చిత్ర వర్గాలంటున్నాయి. 1990 దశకంలో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కనున్న ఈ చిత్రం కార్తి కెరీర్ లో ఇంకో గొప్ప విజయాన్ని యాడ్ చేస్తుందంటున్నారు యూనిట్.

  ఖాకీ-ది పవర్ ఆఫ్ పోలీస్

  ఖాకీ-ది పవర్ ఆఫ్ పోలీస్

  తాజాగా తెలుగులో ఈ సినిమాకి 'ఖాకీ' అనే టైటిల్ ను ఖరారు చేసి, ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మూడు రోజుల్లో ఈ లుక్ కి వస్తున్న ప్రతిస్పందన మామూలుగా లేదు. ఇప్పటికే ఈ సినిమా అప్ డేట్స కోసం తెగ వెతికేస్తున్నారట మనవాళ్ళు. ఎంతైనా కార్తీ సూర్యాలకి మన టాలీవుడ్ బీ గ్రేడ్ హీరోలకన్నా ఒక మెట్టు ఎక్కువ క్రేజ్ కనిపిస్తూంటుంది.

  సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కార్తీ కనిపించనున్న

  సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కార్తీ కనిపించనున్న

  ఈ సినిమాలో, కథానాయికగా రకుల్ అలరించనుంది. వినోద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు చివరివారంలో గానీ, సెప్టెంబర్ మొదటివారంలోగాని విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాతో కోలీవుడ్ లోను రకుల్ బిజీ అవుతుందేమో చూడాలి.

  సెప్టెంబ‌ర్ లో

  సెప్టెంబ‌ర్ లో

  ఈ మూవీ ఆగ‌స్ట్ నెలాఖ‌రులో గాని సెప్టెంబ‌ర్ లో గాని విడుదల కానుంది.. ఖాకీ డ్ర‌స్ లో అదుర్స్ లా ఉన్న కార్తీని మీరూ చూడండి. ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గుజ‌రాత్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తుండ‌గా కొన్ని వివాదాస్పద అంశాలను కూడా టచ్ చేయబోతున్నారనే మాట వినిపిస్తోంది.

  English summary
  'Theeran Adhigaram Ondru' (Tamil), starring Karthi and Rakul Preet Singh in lead roles, is titled as 'Khaki' in Telugu. The film's First Look was released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X