twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాలిటిక్స్ లో పల్లె కుర్రాడు (‘శకుని’ ప్రివ్యూ)

    By Srikanya
    |

    'యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ' ఫేం కార్తీ తాజా చిత్రం 'శకుని' తమిళ, తెలుగు భాషల్లో ఈ రోజే విడుదల అవుతోంది. ఈ చిత్రంలో కార్తీ కమల్ హాసన్ గా కనిపిస్తాడు. వాస్తవ రాజకీయ పరిస్దితులకు అద్దం పడుతూ పొలిటికల్ సెటైర్ గా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే తెలుగులో కార్తీ కి తొలి స్టైయిట్ చిత్రం. ఈ చిత్రాన్ని 450 ప్రింట్లతో భారీగా ఆంధ్రాలో విడుదల చేస్తున్నారు.

    కథ ప్రకారం... కమల్‌ హాసన్‌ (కార్తి) పల్లెటూరి కుర్రాడు. చిక్కుల్లోపడిన తన ఆస్తి వ్యవహారాలు చక్కబెట్టుకొనేందుకు పట్నం వస్తాడు. అక్కడి పరిస్థితులు కమల్‌ ఆలోచనల్లో చాలా మార్పులు తీసుకొస్తాయి. ఓ సందర్భంలో దేశ రాజకీయాలను శాసించే రాజకీయ నాయకుడి (ప్రకాష్‌ రాజ్‌)తో కయ్యానికి కాలు దువ్వుతాడు. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. అప్పుడు కమల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? శ్రీదేవి (ప్రణీత) ఎవరు? కమల్‌కీ శ్రీదేవికీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలు తెరపైనే చూడాలి.

    చిత్ర సమర్పకులు కె.ఇ.జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ ''వర్తమాన రాజకీయాల ప్రస్తావన ఉంటుంది. అయితే అది ద్వితీయార్ధంలోనే. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. కమల్‌హాసన్‌గా కార్తి నటన ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకొంటుంది'' అన్నారు.

    'శకుని అంటే దుష్ట ఆలోచనలే అనుకోవద్దు. ఓ సమస్య నుంచి తెలివిగా ఎలా బయటపడాలో అతనికి బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో శకుని స్వభావం ఉన్నవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ప్రస్తుతం మధ్యవర్తులు లేకపోతే... ఏ పనీ జరగడం లేదు. లంచం ఇవ్వకపోతే ఫైలు కదలడం లేదు. ఈ వాతావరణంలో ఓ యువకుడు శకునిలా తన పనులను చక్కబెట్టుకొన్నాడు అనేదే 'శకుని'అంటున్నారు హీరో కార్తీ.

    సంస్థ: శ్రీ సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌
    నటీనటులు: కార్తి, ప్రణీత, ప్రకాష్‌ రాజ్‌, కోట శ్రీనివాసరావు, రాధిక, నాజర్‌, రోజా, సంతానం తదితరులు
    మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి
    పాటలు: సాహితి
    సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌
    ఛాయాగ్రహణం: పి.జి.ముత్తయ్య
    ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్
    ఆర్ట్‌: రాజీవన్‌
    ఫైట్స్‌: అనల్‌ అరసు
    డాన్స్‌: ప్రేమ్‌ రక్షిత్‌, బాబా భాస్కర్‌
    నిర్మాత: బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు
    దర్శకత్వం: శంకర్‌ దయాళ్‌
    విడుదల: శుక్రవారం.

    English summary
    Sakuni is said to be a political satire and is made as a bilingual simultaneously in Telugu and Tamil. Apparently, it will be the biggest-ever release in Karthi’s career, with 1000 screens worldwide. According to its makers, while all his previous flicks were released as dubbed versions in Andhra, this one titled Sakuni in Telugu will be his first straight film in Tollywood. Bellamkonda Suresh is promoting it as a straight Telugu film and releasing Sakuni in 450 theaters in Andhra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X