»   » సినిమా కోసమే అదంతా : క్రాష్ కోర్స్ నేర్చుకుంటున్న కార్తీ

సినిమా కోసమే అదంతా : క్రాష్ కోర్స్ నేర్చుకుంటున్న కార్తీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఇండియన్ ఫిలిం మేకర్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్న దర్శకుడు మణిరత్నం. తన సినిమాల్లో ప్రతీ ఫ్రేమ్ నీ, ప్రతీ పాత్ర నీ ఎంతో శ్రద్దగా మలుస్తాడు. నటుల మేకప్ దగ్గరి నుంచీ బాడీ లాంగ్వేజ్ వరకూ ఎక్కడా రియాలిటీ మిస్సవటం మణిరత్నం కి ఇష్టం ఉండదు. వీలైనంత వరకూ కృత్రిమత్వపు చాయలు కనిపించ కుండా జాగ్రత్త పడతాడు.......

మణిరత్నం సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న హీరో కార్తి తన పాత్రలో ఒదిగిపోయేందుకు కసరత్తు ప్రారంభించాడు. ఇంకా పేరు పెట్టని ఈ తమిళ చిత్రంలో అతడు పైలట్ పాత్రలో నటించనున్నాడు. ఇందుకోసం పైలట్ క్రాష్ కోర్సులో చేరి శిక్షణ పొందుతున్నాడు.

Karthi will reportedly be seen as a pilot in South inDian filim maker Mani Ratnam's next Movie

పైలట్ స్థానంలో ఎలా కూర్చోవాలి, విమానం నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై కార్తి శిక్షణ తీసుకుంటున్నాడు. కనీసం మరో రెండు మూడు వారాల పాటు ఈ శిక్షణ ఉంటుంది. ఇది పూర్తైన తర్వాత కార్తీ షూటింగ్ లో పాల్గొంటార'ని సినిమా యూనిట్ చెబుతోంది...

కార్తీ ఎన్నారై గా కనిపించనున్న ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కనుంది. భారత్ దేశానికి వచ్చి అనుకోని పరిస్తితుల్లో ఒక లేడీ డాక్టర్ తో ప్రేమలో పడతాడు. ఈ సినిమా లో కార్తి కి జోడీ గా హీరోయిన్ గా అదితిరావు ఎంపికైంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

English summary
Hero Karthi undergoes Pilot Crash Course for his character in Mani Ratnam new Movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu