»   » శభాష్: బొమ్మాళికి...లండన్ డిగ్రీ

శభాష్: బొమ్మాళికి...లండన్ డిగ్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాధారణంగా హీరోయిన్స్ అంటే చదువుపై పెద్దగా దృష్టి పెట్టరు. ఏ ప్లస్ టు నో చదివి ఇండస్ట్రీకు వచ్చేసి అలా కంటిన్యూ అయిపోతూంటారు కానీ వదిలేసిన చదువుని పూర్తి చేయరనే అపప్రధ ఉంది. దాన్ని బ్రేక్ చేయటానికా అన్నట్లు బ్రదర్ ఆఫ్ బొమ్మాళి(అల్లరి నరేష్) చిత్రంలో బొమ్మాళిగా చేసి కార్తిక రీసెంట్ గా డిగ్రీ పూర్తి చేసింది. అదీ ప్రెస్టేజియస్ లండన్ యూనివర్శిటీ నుంచి. ఈ విషయాన్ని ఆమె తన అభిమానులకు ఆనందంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా తెలియచేసింది.

Karthika Nair completes her Graduation

'జోష్' చిత్రం ద్వారా పరిచయమైన నాయిక కార్తిక. నిన్నటి తరం నాయిక రాధ కుమార్తె అయినందున మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ సినిమా కాస్త ఫ్లాపవడంతో కార్తిక పరిస్థితి సందిగ్ధంలో పడింది. నటన బాగానే చేసినా నల్ల పిల్ల అని, గ్లామరస్ గా లేదని తెలుగు దర్శకనిర్మాతలు పెదవి విరిచారు. దీంతో ఆమెకు ఆశించినంతగా అవకాశాలు రాలేదు.

Karthika Nair completes her Graduation

తర్వాత ఆమె రంగం చిత్రంతో తమిళంలో హిట్ కొట్టింది. అంతే కాదు తర్వాత ఎన్టీఆర్ సరసన ఆమె దమ్ము చిత్రంలో చేసింది. అయితే ఆ చిత్రమూ వర్కవుట్ కాలేదు.రీసెంట్ గా మరోసారి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అంటూ కామెడీ చేసే ప్రయత్నం చేసింది. అదీ నెగిటివ్ ఫలితం ఇచ్చింది. ఇలా వరస ఫ్లాపులతో ఆమెకు పెద్దగా ఆఫర్స్ లేకుండా పోయింది. దీంతో ఆమె తల్లి రాధ రంగంలోకి దిగి ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. కోలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోందట.

English summary
Karthika Nair is now Graduate of a prestigious university. "Officially a graduate from the University of London.. bestowed by the princess of England.. #Proud #success #Honour," an excited Karthika shares.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu