»   » 'జోష్' హీరోయిన్ కార్తీక మళ్ళీ తెలుగులో ..డిటేల్స్

'జోష్' హీరోయిన్ కార్తీక మళ్ళీ తెలుగులో ..డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య సరసన హీరోయిన్ గా చేసి తెలుగు తెరకు పరిచయమైన తమిళ అమ్మాయి కార్తీక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురైన కార్తీక ఆ తర్వాత ఆఫర్స్ ఏమీ రాక మిగిలిపోయింది.తాజాగా ఆమె తమిళంలో నటించిన 'కో" హిట్టైంది.దాంతో ఆ చిత్రాన్ని తెలుగులోకి 'రంగం"టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా తమిళ హీరో జీవా నటించారు. ఈ చిత్రం గురించి చిత్ర నిర్మాత జీవా తండ్రి ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ.. నా కుమారుడు జీవా హీరోగా నటించిన 'కో" తమిళంలో ఘనవిజయం సాధించింది. జీవా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ ఇది. దర్శకుడు కె.వి.ఆనంద్‌ 'వీడొక్కడే"తో తెలుగులో హిట్‌ కొట్టారు. 'రంగం" అతడికి రెండో సినిమా ఇక్కడ. మీడియా పవర్‌ ఏంటో చూపించే చిత్రమిది. సమాజంలోని దురాగతాలను, అవినీతిని బైటపెట్టే ఫోటోగ్రాఫర్‌ పాత్రలో జీవా నటించారు. రాధ తనయురాలు కార్తీక అద్భుతంగా నటించింది. మంచి వాణిజ్య విలువలున్న ఈ సినిమా తెలుగులోనూ విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. ఈ నెలాఖరున లేదా మే తొలివారంలో ఇక్కడ విడుదల చేస్తాం" అన్నారు. ఇక ఈ చిత్రంతో అయినా కార్తీకకు తెలుగులో మళ్ళీ ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

English summary
Karthika, daughter of yesteryear South Indian actress Radha, made her debut in the Telugu film Josh with Nag Chaitanya. The actress will now be seen playing a journalist in this week's Tamil release Rangam, which has been directed by National Award winning cinematographer, KV Anand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu