»   » "తొలిప్రేమ" మళ్ళీ ఒకసారి: 20 ఏళ్ళ తర్వాత పవన్ సినిమా సీక్వెల్

"తొలిప్రేమ" మళ్ళీ ఒకసారి: 20 ఏళ్ళ తర్వాత పవన్ సినిమా సీక్వెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తొలి ప్రేమ దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటి వరకూ నార్మల్ హీరో, చిరంజీవి తమ్ముడూ అన్న ట్యాగ్ లనుంచి పవన్ కళ్యాణ్ గా , ఆ తర్వాత పవర్ స్టార్ గా మారటానికి గట్టి పునాది వేసిన సినిమా 1998 లో వచ్చిన తొలిప్రేమ అప్పట్లో టాలీవుడ్ లో ఒక డిఫరెంట్ ఫీల్ తెచ్చిన సినిమా.

లైమ్ లైట్ నుంచి వెళ్లిపోయాడు

లైమ్ లైట్ నుంచి వెళ్లిపోయాడు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన తొలి నాళ్ల‌లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా తొలిప్రేమ‌. క‌ళ్యాణ్ న‌ట‌న‌తో పాటు ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ తోడ‌వ్వ‌డంతో సినిమా బంప‌ర్ హిట్‌గా మారింది. ఆ త‌రువాత క‌రుణాకు అంత పేరు తెచ్చిన సినిమాలు లేవు. పాపం ఆ తర్వాత నెమ్మదిగా లైమ్ లైట్ నుంచి వెళ్లిపోయాడు కరుణాకరణ్...

మళ్లీ అంతటి సక్సెస్‌

మళ్లీ అంతటి సక్సెస్‌

తొలిప్రేమ తర్వాత మళ్లీ అంతటి సక్సెస్‌ను కరుణాకరన్ అందుకోలేకపోయాడు. డైరెక్టర్‌గా ఫెయిల్ అవుతున్న కరుణాకరన్.. ఈ సారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌తో తొలిప్రేమ-2ను తెరకెక్కించే పనిలో పడ్డాడట. ఇప్పటి వరకూ వచ్చిన ఫ్లాపులన్నీ మళ్ళీ ఈ ఒక్క సినిమాతో తుడిచి పెట్టేయాలనే ఆలోచన లో ఉన్నాడట ప్రస్తుతానికి.

తొలిప్రేమ-2

తొలిప్రేమ-2

ఈ సారి ఎలాగైనా సరే సాయిధరమ్‌ తేజ్‌తో తొలిప్రేమ-2 ద్వారా 19 ఏళ్ల క్రితం పవన్‌తో సెట్ చేసిన ట్రెండ్‌ను రిపీట్ చేయాలని, తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లో పడేసుకోవాలని కరుణాకరన్ అనుకుంటున్నాడనే మాట కొన్ని నెలల కిందటి నుంచే వినిపిస్తోంది. ఈయన చివరిగా తెరకెక్కించిన ‘ఎందుకంటే ప్రేమంట' చిత్రం ఫ్లాప్‌ అయ్యింది.

పవన్ వీరాభిమాని నితిన్

పవన్ వీరాభిమాని నితిన్

దాంతో చాలా కాలం నుండి సినిమాలేం చేయకుండా ఖాళీగా ఉన్న కరుణాకరన్‌ ఎట్టకేలకు ఒక తొలిప్రేమ వంటి కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఆ మధ్య పవన్ వీరాభిమాని నితిన్ కూడా తొలిప్రేమ కి సీక్వెల్ చేస్తున్నా అంటూ ప్రయత్నాలు మొదలు పెట్టాడు గానీ తర్వాత వెనక్కి తగ్గాడు.

కథ ఏంటి అనేది

కథ ఏంటి అనేది

దాంతో ఇప్పుడు మామ కథని అల్లుడు భుజాన వేసుకునే ప్రయత్నం లో ఉన్నాడట. ఆ కథ ఏంటి అనేది మాత్రం కరుణాకరన్‌ చెప్తే కాని క్లారిటీ రాదు. కథ ఏది అయినా మెగా హీరో సాయిధరమ్‌ కి మరో మంచి హైప్ నిచ్చే సినిమా అవుతుందనే అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.

వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో

వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో

రచయిత బివిఎస్ రవి డైరక్షన్ లో వస్తున్న జవాన్ లో న‌టిస్తున్నాడు. దీని త‌రువాత వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కాని అది ఇప్ప‌ట్లో ప‌ట్టాలు ఎక్కేలా లేదు. ఇంత‌లో క‌రుణాక‌ర‌న్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సాయిధ‌ర‌మ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసాడ‌ట‌. అయితే ఇది తొలి ప్రేమ సీక్వెల్‌గా తీస్తున్నార‌ని ఫిలింన‌గ‌ర్‌లో టాక్ వినిపిస్తుంది. ఏదీ ఏమైనా ఈ సినిమా ఇద్ద‌రికి బ్రేక్ ఇస్తుందా లేదా అన్న‌ది సినిమా వస్తేనే తేలుతుంది.

English summary
Karunakaran is now out of form and is waiting for a chance to revert back in the industry. For the script he developed, he narrated the line to the Pawan Kalyan’s follower Sai Dharam Tej
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu