»   » కరుణాకర్ దర్శకత్వంలో రామ్-తమన్నాల...‘మన లవ్ స్టోరీ’

కరుణాకర్ దర్శకత్వంలో రామ్-తమన్నాల...‘మన లవ్ స్టోరీ’

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో మొన్నటి 'తొలిప్రేమ' నుంచి నిన్నటి 'డార్లింగ్' వరకు తన ప్రత్యేకతను చాటుకుంటున్న దర్శకుడుగా కరుణాకరన్ ను చెప్పుకోవచ్చు. ప్రేమలో వుండే సున్నితత్వానికి మరింత సున్నితంగా, అందంగా దృశ్య రూపాన్నిస్తాడు. ఇప్పుడీ దర్శకుడు 'దేవదాసు' రామ్ తో మరో ప్రేమకథా చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన డిస్కషన్స్ గత కొన్నాళ్లుగా జరుగుతున్నాయి.

కరుణాకరన్ చెప్పిన స్టోరీ హీరో రామ్ కి ఎంతగానో నచ్చినట్టు, షూటింగు ఎప్పుడు మొదలవుతుందా? అన్న క్యురియాజిటీతో అతను వున్నట్టు చెబుతున్నారు. దీనికి 'మన లవ్ స్టోరీ' అనే టైటిల్ ని పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో రామ్ సరసన క్యూట్ గాళ్ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోంది. మే నెలలో ఈ సినిమా సెట్స్ కి వెళుతుంది. రామ్ ప్రస్తుతం కంతిరీగ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు, అలాగే తమన్నా బద్రీనాథ్ సినిమాలోనూ, సుకుమార్ డైరెక్షన్ లో నాగచైతన్య సినిమా షూటింగ్ లతో బిజిగా వున్నారు.

English summary
Telugumovienews.info has earlier reported that young and energetic hero Ram has signed up a new film under the direction of Karunakaran. Karunakaran has proved his mettle in Tollywood with films like Tholi Prema, Ullasamga Uthsahamga etc. The latest update is this new film has been titled as Mana Love Story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu