»   » 7 బంగళాలు, లెక్కలేనని నగలు: సావిత్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కాసు!

7 బంగళాలు, లెక్కలేనని నగలు: సావిత్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన కాసు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మహానటి సావిత్రి గురించి మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మా అమ్మతో సావిత్రికి మంచి అనుబంధం ఉండేదని, తాను అప్పట్లో అమ్మతో కలిసి ఆమెను కలిసేవాడిని అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబంతో మా కుటుంబానికి చాలా మంచి రిలేషన్ ఉందని, సావిత్రిని తాను ఆంటీ అని పిలిచేవాడినని, ఆమె చాలా దానకర్ణురాలు, అనేక దాన ధర్మాలు చేసేవారు. తన వద్ద పని చేసే వారు మోసం చేశారని తెలిసినా ఆమె పెద్దగా పట్టించుకునే వారు కాదు అని కాసు కృష్ణారెడ్డి తెలిపారు.

  Mahanati Savitri Daughter Faces Serious Controversies
  హీరోలకంటే హయ్యెస్ట్ పారితోషికం

  హీరోలకంటే హయ్యెస్ట్ పారితోషికం

  ఒకానొక సమయంలో తెలుగు సినిమా పరిశ్రమలో అప్పట్లో స్టార్లుగా వెలుగొందిన హీరోల కంటే హయ్యెస్ట్ పారితోషికం సావిత్రి తీసుకునే వారు. ఒక టైమ్ పీరియడ్లో తెలుగు సినిమా పరిశ్రమను ఆమె ఏలారు అని కాసు కృష్ణారెడ్డి తెలిపారు.

  చాలా ఆస్తులు ఉండేవి

  చాలా ఆస్తులు ఉండేవి

  ఆమెకు చాలా బంగళాలు ఉన్నాయి. కొడైకనాల్‌లో ఒకటి, హైదరాబాద్‌లో రెండు, విజయవాడలో ఒకటి, చెన్నైలో 4 బంగళాలు ఇలా చాలా ఆస్తులు ఉండేవి. చివరకు అన్నీ పోయాయి. ఆమె ఎవరికైతే సాయం చేసిందో వారు అక్కరకకు రాలేదు. ఆమె పొలాలు, ఇల్లు తీసుకున్నవారు ఆమెకు సాయం చేయలేదు... అని కాసు కృష్ణారెడ్డి తెలిపారు.

  నిలువుదోపిడీ ఇచ్చేశారు

  నిలువుదోపిడీ ఇచ్చేశారు

  అప్పట్లో వార్ ఏదో వస్తే ఆర్మీకి సహాయం చేయడానికి దోపిడీ ఇచ్చేశారు. అప్పట్లో తమ ఒంటిమీద ఉన్న నగలన్నీ ఇచ్చేయడాన్ని నిలువుదోపిడీ అనేవారు. అలా ఆమె ఎన్నో దానాలు చేశారు అని కాసు కృష్ణారెడ్డి తెలిపారు.

  విజయ చాముండేశ్వరి గురించి

  విజయ చాముండేశ్వరి గురించి

  సావిత్రి ఆంటీ కూతురు విజయ చాముండేశ్వరితో కూడా మంచి అనుబంధం ఉంది. సావిత్రి ఇంటి పక్కన స్థలం ఉంటే అందులో విజయ చాముండేశ్వరి కుటుంబం 4 ఫ్లోర్స్‌లో ఇల్లు కట్టుకున్నారు. ఈ మధ్యనే అది కూడా అమ్మేసి మోంటియత్ రోడ్ ఎగ్మూర్‌కు వెళ్లి అక్కడ నాలుగైదు కోట్ల విలువ చేసే రిచ్ ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు.... అని కాసు కృష్ణారెడ్డి తెలిపారు.

  రైడ్స్‌లో అంతా పోయింది

  రైడ్స్‌లో అంతా పోయింది

  సావిత్రి ఆంటీ, జెమినీ గణేశన్ బావుండటం చూశాను, దూరం అవ్వడం చూశాను. 1958లో తొలి ఇన్ కంటాక్స్ రైడ్ జరిగింది. ఆ తర్వాత కూడా రైడ్స్ జరిగాయి. ఆమెకు 25 డైమండ్ నక్లెస్‌లు ఉండేవి. చాలా డబ్బు ఉండేది. చివరకు అంతా పోయిందని వెల్లడించారు.

  అనేక సహాయాలు చేశారు

  అనేక సహాయాలు చేశారు

  తన పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని రేపల్లె దగ్గర వడ్డివారి‌పాలెంలో స్కూలు కోసం 60ల్లో 25 వేలు డొనేట్ చేశారు. ఇలా ఆమె చాలా మంచి పనులు చేశారు.... అని కాసు కృష్ణారెడ్డి గుర్తు చేసుకున్నారు.

  English summary
  Kasu Krishna Reddy Revealed Interesting Facts In Savitri's Life. Savitri was an Indian film actress, playback singer, dancer, director and producer. She appeared mainly in Telugu and Tamil language films but also in Kannada, Malayalam, and Hindi language films. Mahanati, The life story of South Indian actress Savitri, who took the film industry by storm in the late '50s and '60s.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more