»   » ఎంతరీమేక్ అయితే.., మరీ ఇంత కాపీ పేస్ట్ లాగానా..!? పవన్ పోస్టర్ పై విమర్శలు

ఎంతరీమేక్ అయితే.., మరీ ఇంత కాపీ పేస్ట్ లాగానా..!? పవన్ పోస్టర్ పై విమర్శలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాటమ రాయుడు సినిమా అనౌన్స్ చేసిన తొలి రోజునుంచే ఇది రీమేక్ అంటూ ప్రచారం మొదలయ్యింది. అది రీమేక్ కాదని చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. సరే అనుకోండి ఊహించని విధంగా ఉంటుందీచ్ అంటూ షూటింగ్ మొదలు పెట్టగానే దర్శకుడు సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి జంప్ అయ్యాడు. అప్పటికప్పుడు గోపాలా గోపాల దర్శకుడు డాలీని తీసుకొచ్చి షూటింగ్ స్టార్ట్ చేసేసారు. కొన్నాళ్ళు హీరోయిన్ కోసం, మరికొన్నాళ్ళు హీరో తమ్ముళ్ళకోసం.., మరికొన్నాళ్ళు టైటిల్ కోసం ఇలా ప్రతీ దశలోనూ ఏదో ఒక ఇబ్బంది తో నలిగి పోతూనే ఉన్నాడు " కాటమ రాయుడు"

అన్నీ దాటుకొని సినిమా మొదలుపెట్టినా ఈ ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. ఈ దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ని చూసి పాత పాట మళ్ళీ పైకి వచ్చింది. కొత్తగా వచ్చిన స్టిల్ అచ్చుగుద్దినట్టు హీరోయిన్ చీర రంగుతో సహా ఒకేలాగా ఉండటం తో ఇది పక్కా రీమేక్ అంటూ మళ్ళీ ప్రచారం మొదలయ్యింది. అసలూ రీమేక్ అయితే వచ్చే నష్టమేమిటీ అంటారా?? ఒక సారి ఇది చదవండి

 వీరమ్ లోని స్టిల్ లా ఉంది:

వీరమ్ లోని స్టిల్ లా ఉంది:


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు సినిమా మీద విమర్శల వర్షం మొదలైంది. తను తీసే సినిమా స్ట్రైట్ సినిమాలా ఫీల్ కలిగిస్తున్నా పవన్ తీసేది ఓ రీమేక్ సినిమా అని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. అయితే ఈ విషయం ఎలా కనిపెట్టారు అంటే దీవాళికి రిలీజ్ చేసిన పోస్టర్స్ తో కన్ఫాం చేశారట. డాలి డైరక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు సినిమా దీవాళి గిఫ్ట్ గా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్ అచ్చు గుద్దినట్టు తమిళ సూపర్ హిట్ సినిమా వీరమ్ లోని స్టిల్ లా ఉంది.

 ఎప్పుడో రిలీజ్ అయ్యింది:

ఎప్పుడో రిలీజ్ అయ్యింది:


కావొచ్చు ఎన్నో రీమేక్ లు వస్తున్నప్పుడు ఈ సినిమా రీమేక్ అయితే తప్పేమిటీ అంటారా?? అక్కడే ఉంది ట్విస్టు తమిళం లో అజిత్ హీరోగా నటించిన వీరమ్ తెలుగు లో "వీరుడొక్కడే" పేరుతో ఎప్పుడో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ అదే సినిమా అంటే ఇంకో ఫ్లాప్ ని కోరి మరీ తెచ్చుకున్నట్టే. అన్నది అభిమానుల భయం, అందుకే మొదటినుంచీ "కాటమ రాయుడు" వీరమ్ కి రీమేక్ కాదూ అని పదే పదే చెప్తోంది ఈ సినిమా యూనిట్.

 పెళ్లంటూ చేసుకోకూడదని:

పెళ్లంటూ చేసుకోకూడదని:


నలుగురు అన్నదమ్ముల మధ్య సాగే కథ. ఒక గ్రామంలో అజిత్‌తో పాటు అతని నలుగురు తమ్ముళ్లు పోకిరిగా తిరుగుతూ గొడవల్ని కొనితెచ్చిపెడుతుంటారు. ఇంకా పెళ్లంటూ చేసుకోకూడదని, భార్య అంటూ వస్తే సోదరులు విడిపోతామని, కాబట్టి వివాహం చేసుకోకూడదని శపథం చేస్తారు. కానీ ఈ ఐదుగురిలో ఇద్దరు ప్రేమలో పడతారు.

 ఇదే ఆ కథ:

ఇదే ఆ కథ:


అయితే తమకంటే పెద్దవాళ్లు పెళ్లి చేసుకోకూడదనే శపథంతో ఉన్నప్పుడు తమ ప్రేమ పెళ్లి జరగదనే ఉద్దేశంతో అన్నయ్యలను సైతం ప్రేమలో పడేట్లు ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో తమన్నా, అజిత్‌ల మధ్య ప్రేమాయణం మొదలవుతుంది.పంచపాండవులకు గొడవలంటే మహాయిష్టం. ఈ విషయం తెలియని తమన్నా.. అజిత్ ప్రేమలో పడిపోతుంది. ఈ క్రమంలో అజిత్ నైజం మెల్లగా బయటపడుతుంది. దీంతో తాను ఇష్టపడిన యువతి తనకు దూరమవుతుందని భావించిన అజిత్.. ఆమెతో పాటు.. ఆమె తండ్రిని కూడా ఒప్పిస్తాడు. ఈ క్రమంలో అజిత్ సోదరులు అదే ఊరిలో కొద్దిరోజులుంటారు.

 పవన్ కూడా ఇదే కథా??:

పవన్ కూడా ఇదే కథా??:


ఈ నేపథ్యంలో ఓ ముఠా హీరోని చంపటానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ ముఠా ఈ ఐదుగురిని టార్గెట్ చేయలేదని, వారి లక్ష్యం తమన్నా ఫ్యామిలీనేనని తెలిసిపోతుంది. ఆ ముఠా ఎవరు? ఆ ముఠా తమన్నా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసింది? నాజర్ కుటుంబానికి తెలియకుండానే అజిత్ సోదరులు ఆ ముఠాను ఎలా మట్టుబెడతారు అనేది కథాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇదే కథని:

ఇదే కథని:

ఇదే కథని కొన్ని మార్పులతో తెరకెక్కిస్తున్నామని "కాటమ రాయుడు" టీమ్ తెలిపినా అలాంటిదేం లేదనీ సినిమా మొత్తం కాపీ పేస్టేనా అనే ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రూఫ్ గా మొన్న దీవాపవళీ సందర్భంగా విడుదలైన "కాటమ రాయుడు" పోస్టర్ నీ వీరమ్ చిత్ర పోస్టర్నీ కలిపి చూపిస్తున్నారు.నిజానికి ఇది రీమేక్ కాదనీ కొన్ని పోలికలు మాత్రమే ఉన్నాయి తప్ప వీరమ్ కీ తన కథ కీ ఎక్కడా సంబందం ఉండదనీ చెప్తూ వస్తూనే ఉంది కాటమ రాయుడు యూనిట్ కానీ ఈ కొత్త పోస్టర్ ఇలా కన బడటం తో అభిమానుల్లో కాస్త కంగారు మొదలయ్యింది

 ఇలా కాపీ పోస్టర్ తో:

ఇలా కాపీ పోస్టర్ తో:


అజిత్, తమన్నా జంటగా నటించిన ఈ సినిమా అక్కడ హిట్ సాధించింది. అయితే పవన్ తీసేది రీమేక్ కాదు కాని ఆ సినిమాలోని స్టిల్ తో పవన్ శృతి హాసన్ పోస్టర్ వచ్చేసరికి ఫ్యాన్స్ కంగారు పడటం మొదలు పెట్టారు. ఓ ఫ్యాక్షన్ కథతో వస్తున్న కాటమరాయుడు సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మించిన శరత్ మరార్ నిర్మిస్తున్నారు. మరి పవన్ సినిమా అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. అలాంటిది ఇలా కాపీ పోస్టర్ తో దించేస్తే ఎలా అంటున్నారు అభిమానులు.

మరి అవే స్టిల్స్ ఎందుకు??:

మరి అవే స్టిల్స్ ఎందుకు??:

ఓ విధంగా సినిమా మీద ఇలాంటి పోస్టర్స్ నెగటివ్ ఫీడ్ బ్యాక్ తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. మరి చేసేదేదో రీమేక్ చేస్తున్నాం అని చెప్పకుండా ఇలా ఆ సినిమాలోని స్టిల్స్ వాడటం ఏంటో వారికే తెలియాలి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటుగా మరో ముగ్గురు కుర్ర హీరోలు నటిస్తున్నట్టు టాక్. సర్దార్ ఫ్లాప్ తో ఫ్యాన్స్ ను నిరాశ పరచిన పవన్ కాటమరాయుడితో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. అంచనాలైతే తారా స్థాయిలో ఉన్నాయి మరి సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే వచ్చే సమ్మర్ దాకా ఎదురుచూడాల్సిందే.

English summary
Satires on Katama Rayudu Special Diwali Poster, still is like veeram poster
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu