»   » పవన్ ఫ్యాన్స్ బలహీనతే కాసులపంట, సేవ పేరుతో అక్రమంగా...!

పవన్ ఫ్యాన్స్ బలహీనతే కాసులపంట, సేవ పేరుతో అక్రమంగా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతుందంటే చాలు బెనిఫిట్ షోల పేరుతో అభిమానుల బలహీనతను క్యాష్ చేసుకోవడానికి రంగం సిద్దం అవుతుంది. అది మెగాస్టార్ అయినా, సూపర్ స్టార్ అయినా, పవర్ స్టార్ అయినా, మరే స్టార్ అయినా..... సీన్ మాత్రం ఒక్కటే, అభిమానులను దోపిడీచేయడం.

తాజాగా 'కాటమరాయుడు' సినిమా విషయంలోనూ చాలా చోట్ల ఇలాంటి దోపిడీ పర్వం కొనసాగింది. బెనిఫిట్ షోల పేరుతో ప్రత్యేక షోలు వేసి... పవన్ అభిమానుల నుండి సాధారణ టికెట్ రేట్ల కంటే 10 నుండి 20 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేసినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. కాటమరాయుడు టిక్కెట్స్ రూ. 500 నుండి రూ. 3000 వరకు అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది.


ప్రశ్నిస్తే సేవ కార్యక్రమాల కోసం అంటారు

ప్రశ్నిస్తే సేవ కార్యక్రమాల కోసం అంటారు

బెనిఫిట్ షో టికెట్ రేట్లు ఇంత ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తే... వీటిని సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తాం, మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదు అంటూ వాదిస్తారు. వీరు చేసే సేవలో నిజం ఎంతో ఎవరికీ తెలియదు.


లెక్కలుండవు

లెక్కలుండవు

బెనిఫిట్ షోల ద్వారా జరిగే దోపిడీ పర్వంలో లెక్కలు అసలు ఉండనే ఉండవు. అభిమానుల నుండి అందిన కాడికి దోచుకోవడమే పరమావధిగా ఈ తంతు సాగుతుంది. దీని వెనక థియేటర్స్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్స్ హస్తం ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి.


పిచ్చిగా అభిమానించే వాళ్లే టార్గెట్

పిచ్చిగా అభిమానించే వాళ్లే టార్గెట్

ఆయా అగ్ర హీరోలను పిచ్చిగా అభిమానించే వాళ్లే.... ఈ బెనిపిట్ షోల ద్వారా దోపిడీ పర్వ కొనసాగించే వారికి ప్రధాన టార్గెట్. మొదట బినిఫిట్ షో టికెట్స్ లేవని బుకాయిస్తారు.... తర్వత టికెట్స్ కొన్నే ఉన్నాయి డిమాండ్ ఎక్కువగా ఉంది అంటూ భారీగా వారి నుండి వసూలు చేస్తారు.


అధికారులు, పోలీసులకు మామూళ్లు

అధికారులు, పోలీసులకు మామూళ్లు

బెనిఫిట్ షోల పేరుతో ఈ దోపిడీ దందా నిర్వహించే వారు ముందుగానే అధికారులను, పోలీసులను మచ్చిక చేసుకుని వారి ఎంతో కొంత ముట్టజెప్పి తమ దోపిడీ పర్వానికి అడ్డుపడకుండా అన్ని ముందే సెట్ చేసుకుంటారనే వాదన కూడా ఉంది.
కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు రద్దు

కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు రద్దు

అయితే కొన్ని చోట్ల ఈ బెనిఫిట్ షో విషయంలో గొడవలు, దోపిడీ జరుగుతుందనే ఆరోపణలు భారీగా రావడంతో అనుమతులు నిరాకరించారు. హైదరాబాద్ లో కొన్ని చోట్ల రద్దు చేసారు. అయితే ఇతర ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు యదావిధిగా కొనసాగినట్లు సమాచారం.


English summary
'Katamarayudu' is releasing in 2,000 screens across the World Today. Hundreds of Benefit Shows have been planned the allover Telugu States on Thursday midnight and early hours of Friday. Sources informed that they have called off The Special Shows planned by Fans in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu