»   » తమిళనాట ‘కాటమరాయుడు’ హవా... షాకైన లోకల్ హీరోలు!

తమిళనాట ‘కాటమరాయుడు’ హవా... షాకైన లోకల్ హీరోలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' తమిళనాడులోనూ గ్రాండ్ గా రిలీజైంది. తమిళనాడులో కాటమరాయుడు చిత్రాన్ని 800 పైచిలుకు స్క్రీన్లలో రిలీజ్ చేసినట్లు సమాచారం. తమిళంలో లోకల్ టాప్ స్టార్ల సినిమాలే 500 నుండి 800 స్క్రీన్లలో రిలీజ్ అవుతాయి.

అలాంటిది ఒక తెలుగు స్టార్ సినిమా తమిళనాడులో ఇంత భారీగా రిలీజ్ అవుతుండటం చర్చనీయాంశం అయింది. తమిళనాట 'కాటమరాయుడు'కు దక్కుతున్న క్రేజ్‌ అక్కడి హీరోలను సైతం షాకవుతున్నారు.

ఇంత భారీగా

ఇంత భారీగా

సాధారణంగా తెలుగు స్టార్ల చిత్రాలకు తమిళనాడు వ్యాప్తంగా 50 నుండి 100 స్క్రీన్లు కంటే ఎక్కువ లభించవు. కానీ కాటమరాయుడు సినిమా ఒక్క చెన్నైలోనే 170 స్క్రీన్లలో రిలీజ్ అయినట్లు సమాచారం. తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

పివిఆర్

పివిఆర్

ఒక పీవీఆర్‌లోనే ఈ రోజు 58 షోలలో కాటమరాయుడు సినిమాను ప్రదర్శిస్తున్నారు. గతంలో రజనీ కబాలి సినిమా ఇదే పీవీఆర్‌లో 62 షోలు వేయడం జరిగింది. చెన్నైలోని అన్ని సర్కిల్స్ లో ఎక్కువ శాతం కాటమరాయుడికే థియేటర్స్ కేటాయించారు.

 అదే సినిమా అయినా

అదే సినిమా అయినా

పైగా ‘కాటమరాయుడు' సినిమా తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వీరమ్' చిత్రానికి ఇది రీమేక్. అదే చిత్రం రీమేక్ వెర్షన్, అందులోనూ తమిళనాడులో ఇంత భారీగా రిలీజ్ చేయడం విశేషమే మరి.

అజిత్ ఫ్యాన్స్ బేనర్లు

అజిత్ ఫ్యాన్స్ బేనర్లు

అజిత్ అభిమానులు కూడా ‘కాటమరాయుడు'ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నాు. కొన్నిచోట్ల ‘కాటమరాయుడు'కు స్వాగతం పలుకుతూ అజిత్ ఫ్యాన్స్ బ్యానర్లు కూడా ఏర్పాటు చేసారు.

English summary
Distributors have allotted large number of screens and the buzz is that Pawan’s records crossed the boundaries and it is trending news records of Telugu movies in Tamil Nadu history.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu