పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ సంక్రాంతి కానుక....
ఈ సంక్రాంతికి పవన్ అభిమానులకు 'కాటమరాయుడు' నుండి ఓ కానుక రాబోతోంది.
హైదరాబాద్: ఈ సంక్రాంతికి పవన్ అభిమానులకు 'కాటమరాయుడు' నుండి ఓ కానుక రాబోతోంది. పండగరోజు అభిమానులను సంతోష పెట్టేందుకు టీజర్‌ను జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది.
కిషోర్‌కుమార్ పార్ధసాని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. శివబాలాజీ, కమల్ కామరాజు, అజయ్, అలీ, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
న్యూఇయర్ సందర్భంగా కాటమరాయుడు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ లుక్ లో పవన్ క ళ్యాణ్ ఆకట్టుకుంటున్నాడు. ఫ్యాక్షన్ ప్రేమ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఉగాదికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











