»   » ఫేస్‌బుక్‌లో కాటమరాయుడు పైరసీ వీడియో.. కేసు నమోదు..

ఫేస్‌బుక్‌లో కాటమరాయుడు పైరసీ వీడియో.. కేసు నమోదు..

Written By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం పైరసీ బారిన పడింది. కరీంనగర్‌లో కొందరు పైరసీకి పాల్పడ్డారు. ఈ చిత్రం మొత్తాన్ని వీడియోగా మలిచి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఇప్పటికే కాటమరాయుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Katamarayudu

ఈ విషయాన్ని తెలుసుకొన్న పవన్ కల్యాణ్ అభిమానులు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చర్యకు పాల్పడిన కొందరిని గుర్తించి అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం.

Katamarayudu

ఫేస్‌బుక్‌లో ఇప్పటికే కాటమరాయుడు పైరసీ వీడియోకు 10 వేలకు పైగా వ్యూస్ వచ్చినట్టు సమాచారం. కాటమరాయుడు పైరసీపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి.

English summary
Katamarayudu piracy video uploaded in facebook. This happend in Karimnagar town. Fans filed a complaint in One town police station of Karim Nagar. Case is under investigation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu